అన్వేషించండి

KTR New Look : క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?

KTR Mass Look Telangana: క్లాస్ ఇమేజ్ వీడి మాస్ లుక్‌లోకి మారారు కేటీఆర్.త్వరలో పాదయాత్ర ప్రారంభించబోతున్నందున కొత్త లుక్ ట్రై చేసి ప ప్రజల్లో కొత్త ఇమేజ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు.

KTR Padayatra Strategy BRS:  రాజకీయం అంటే కేవలం సిద్ధాంతాలు, సుదీర్ఘమైన సభా ప్రసంగాలు, ఆకర్షణీయమైన మేనిఫెస్టోలకే పరిమితం కాదనేది ఆధునిక విజువల్ మీడియా యుగంలో స్పష్టమవుతున్న సత్యం. ప్రజాస్వామ్యంలో నాయకుడి ప్రవర్తనతో పాటు ఆయన విజువల్ అప్పీరెన్స్ కూడా ప్రజల మనస్తత్వాన్ని, అభిప్రాయాలను ప్రభావితం చేసే ప్రధాన అంశంగా మారిపోయింది. గతంలో విదేశీ విశ్వవిద్యాలయాల డిగ్రీలు, కార్పొరేట్ నేపథ్యం, ఎల్లప్పుడూ క్లీన్ షేవ్‌తో సాఫ్ట్‌గా, విదేశీ రీతిలో కనిపించిన నేతలను విపక్షాలు పప్పు అంటూ మాస్ ప్రజలకు దూరం చేసేలా ప్రచారం చేసిన దాఖలాలను తెలుగు రాజకీయాల్లో చూశాం. అదే ముద్ర పడిన నారా లోకేష్.. తన పాదయాత్ర నాటికి బాడీ లాంగ్వేజ్, మాటతీరు, కట్టుబొట్టు మార్చుకుని తన ఇమేజ్‌ను పూర్తిగా రీబ్రాండ్ చేసుకుని విజయం సాధించారు. ఇప్పుడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్  కూడా అదే తరహా మేక్ ఓవర్ మార్గంలో అడుగులు వేస్తున్నారు. 

మాస్ లుక్‌ ట్రై చేస్తున్నకేటీఆర్      

ఇప్పటివరకు ఐటీ మంత్రిగా, అర్బన్ డెవలప్‌మెంట్ ఫేస్‌గా విదేశీ పెట్టుబడులు, కార్పొరేట్ సదస్సులు, సూట్ అండ్ టై లేదా ట్రెండీ క్లాస్ దుస్తుల్లో కనిపించిన కేటీఆర్.. ఇటీవల ఒత్తైన గడ్డం, మాస్ లుక్‌తో ప్రజల ముందుకు రావడం సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రామగుండం సింగరేణి కార్మిక గర్జన సభ నుంచి సచివాలయ సమీక్షల వరకు ఆయన కొత్త గడ్డం లుక్ వైరల్ కాగా.. రాబోయే తెలంగాణ వ్యాప్త పాదయాత్రకు  సిద్ధమయ్యే క్రమంలోనే కేటీఆర్ ఈ మాస్ మేక్ ఓవర్ ఎంచుకున్నారని  భావిస్తున్నారు. తనకున్న అర్బన్, క్లాస్ ఇమేజ్ ను తొలగించుకుని, క్షేత్రస్థాయి గ్రామీణ, కార్మిక, మాస్ ప్రజలకు మరింత దగ్గర కావాలనే వ్యూహం ఈ రూపమార్పు వెనుక ఉందనేది స్పష్టమవుతోంది.

ఈ మార్పే పని చేయదు.. ఈ మార్పు కూడా ఓ కారణం!

అయితే, ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏమిటంటే.. కేవలం గెటప్ మార్చినంత మాత్రాన లేదా గడ్డం పెంచినంత మాత్రాన రాజకీయాల్లో ఓట్ల వర్షం కురుస్తుందా? ప్రజలు ఒక నాయకుడిని కేవలం ఆయన బాహ్య రూపాన్ని చూసి గెలిపిస్తారా? అనే కోణంలో లోతైన విశ్లేషణ అవసరం. గెటప్ చేంజ్ అనేది కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, ప్రాథమిక క్యూరియాసిటీని పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అసలైన మార్పు అనేది నాయకుడి భావజాలం, ప్రజా సమస్యలపై పోరాడే తీరు, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యే విధానంలో స్పష్టంగా కనిపించినప్పుడే ఆ  విజువల్ చేంజ్ కు రాజకీయ అర్థం ఏర్పడుతుంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు  ఇటీవలి రాహుల్ గాంధీ, నారా లోకేష్‌లను గమనిస్తే.. వారు  వేల కిలోమీటర్లు ఎండనకా, వాననకా ప్రజల మధ్య నడిచారు. పాదయాత్రల్లో ప్రజల కష్టాలను నేరుగా విని, వారి ఆవేదనను ప్రతిబింబించారు. ఆ నిరంతర శ్రమ, క్షేత్రస్థాయి పట్టుకు అనుబంధంగా వారి గెటప్  ఒక శక్తివంతమైన సింబాలిజమ్‌గా పనిచేసింది. కేటీఆర్ విషయంలో కూడా ఆయన పెంచిన గడ్డం లేదా మాస్ లుక్ అనేది పాదయాత్రలో ప్రజలను కలిసేటప్పుడు ఒక సీరియస్ పోరాట ప్రతిమను ఇస్తుందే తప్ప.. ప్రజాక్షేత్రంలో గడిపే సమయం, వినిపించే గొంతుక ఆధారంగానే ఓటర్ల తీర్పు ఆధారపడి ఉంటుంది.

కేటీఆర్ లుక్స్ ను ట్రోల్ చేస్తున్న ఇతర పార్టీలు

మరోవైపు, ప్రత్యర్థి కాంగ్రెస్, బీజేపీలు కేటీఆర్ కొత్త లుక్‌ను తీవ్రంగా ట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.  సోషల్ మీడియాలో కూడా ఈ మేక్ ఓవర్‌పై మీమ్స్, రీల్స్ హల్‌చల్ చేస్తున్నాయి. రాజకీయాల్లో మేక్ ఓవర్ అనేది ప్రచార వ్యూహంలో భాగమే అయినప్పటికీ, అది విజయానికి ఒక సాధనం మాత్రమే తప్ప, విజయాన్ని ఖాయం చేసే ఏకైక కారకం కాదు. కేటీఆర్ తన 'క్లాస్' పరిమితులను దాటుకుని, క్షేత్రస్థాయి మాస్ నాయకుడిగా రూపాంతరం చెందడానికి ఈ గెటప్ మార్పు ఉపయోగపడవచ్చు. కానీ, ఓట్లు రాలాలన్నా, బీఆర్ఎస్ మళ్లీ పూర్వ వైభవం సాధించాలన్నా.. ఆ గెటప్ వెనుక ఉన్న నాయకుడు తెలంగాణ క్షేత్రస్థాయి ప్రజా సమస్యలపై ఎంత కసిగా, ఎంత నిలకడగా పోరాడతారనే అంశమే అంతిమ తీర్పును నిర్ణయిస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Kavitha vs Harish Rao : హరీశ్ రావుపై కవిత ఆరోపణలు - రేవంత్ స్క్రిప్ట్ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కౌంటర్.. కాంగ్రెస్‌కు లాభం చేకూరే రాజకీయమా?
హరీశ్ రావుపై కవిత ఆరోపణలు - రేవంత్ స్క్రిప్ట్ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కౌంటర్.. కాంగ్రెస్‌కు లాభం చేకూరే రాజకీయమా?
Telangana Phone Tapping Case: ఏ1గా కేసీఆర్, ఏ2గా కేటీఆర్ పేర్లతో ఫోన్ ట్యాపింగ్ కేసు ఛార్జ్‌షీట్ రెడీ? - తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెగ!
ఏ1గా కేసీఆర్, ఏ2గా కేటీఆర్ పేర్లతో ఫోన్ ట్యాపింగ్ కేసు ఛార్జ్‌షీట్ రెడీ? - తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెగ!
Delimitation Bill 2026: పార్లమెంట్ సీట్ల పునర్విభజనపై మారిన రాజకీయ సమీకరణాలు - ఇండీ కూటమిలో కాంగ్రెస్ ఒంటరి - మిత్రపక్షాలు సై !
పార్లమెంట్ సీట్ల పునర్విభజనపై మారిన రాజకీయ సమీకరణాలు - ఇండీ కూటమిలో కాంగ్రెస్ ఒంటరి - మిత్రపక్షాలు సై !
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
Shubman Gill Strategy:  కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
Amaravati Financial Plan: అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Bigg Boss Season 10 Today November 16th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
Embed widget