By: ABP Desam | Updated at : 23 Jun 2023 08:32 AM (IST)
Edited By: jyothi
బైక్ తో సహా డ్రైనేజీలో పడిపోయిన ఐదుగురు వ్యక్తులు - మాట్లాడుతూ ఉండగానే ప్రమాదం, వీడియో వైరల్! ( Image Source : CCTV Idiots )
Viral Video: అదో పంక్చర్ షాప్. అక్కడే బైక్ మెకానిక్ చేస్తున్నాడో వ్యక్తి. మరో నలుగురు వ్యక్తులు అక్కడే ఉన్న యజమానితో ఏదో మాట్లాడుతున్నారు. అంతలోపే వారు నిల్చున్న శ్లాబు కూలిపోయింది. కింద డ్రైనేజీ ఉండగా.. ఐదుగురు వ్యక్తులు బైకుతో సహా అందులో పడిపోయారు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడే ఉ్నన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియోను ఎవరో తీసి నెట్టింట పెట్టగా వైరల్ గా మారాయి. అయితే డ్రైనేజీ ఎక్కువ లోతుగా లేకపోవడంతో.. అందులో పడిపోయిన వ్యక్తులు బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. చిన్న చిన్న గాయాలు అయినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగనట్లుగా తెలుస్తోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం వైరల్ గా మారింది.
Wait for it pic.twitter.com/rIvOBaVzB2
— CCTV IDIOTS (@cctvidiots) June 21, 2023
ఈ వీడియోను జూన్ 21వ తేదీన ట్విట్టర్ అకౌంట్‌లో పెట్టగా.. ఇప్పటి వరకు 3.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. వేలల్లో లైకులు వందల్లలో కామెంట్లు వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. వీడియో అదిరిందని కొందరు, దేవుడు పిలుస్తున్నాడని మరికొందరు, వాళ్లకు తెలిసే ఇదంతా జరిగిందంటూ కొందరు తమ మనసులోని భావాలను వెల్లడిస్తున్నారు.
ఈ వీడియోను ఎవరికి నచ్చినట్టు వాళ్లు ప్రత్యర్థులపై ట్రోల్స్ చేసేందుకు వాడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలపై సెటైర్లు వేస్తూ ఓ వ్యక్తి దీన్ని పోస్టు చేశాడు.
Heart of Milky Way: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫోటో చూసి సైంటిస్టులు షాక్
Viral Video: కార్‌పై క్రాకర్స్ కాల్చిన ఆకతాయిలు,రోడ్డుపై గట్టిగా కేకలు వేస్తూ నానా రచ్చ - వీడియో వైరల్
Thailand offers a crazy offer to Indians : థాయ్ మసాజ్ కావాలా? ఇండియన్స్‌కి క్రేజీ ఆఫర్ ఇచ్చిన థాయ్‌లాండ్
యాక్సిడెంట్ అయిన కార్‌లో మందు బాటిల్స్, ఎగబడి ఎత్తుకెళ్లిన స్థానికులు - వైరల్ వీడియో
ఆఫీస్‌లో మరీ అతిగా పని చేస్తున్నారా? వర్కింగ్ అవర్స్ పెరిగితే ఆయుష్షు తగ్గిపోవడం ఖాయం!
Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ
/body>