Viral Video: ఫ్లోటింగ్ బిర్యానీని ఎప్పుడైనా చూశారా? లేదంటే ఇప్పుడు చూడండి - వైరల్ వీడియో
Viral Video: హైదరాబాద్‌లో వరద నీటిలో రెండు బిర్యానీ పాత్రలు కొట్టుకుపోవడాన్ని స్థానికులు వీడియో తీశారు. ఇప్పుడిది వైరల్ అవుతోంది.
Floating Biryani:
పాపం వాళ్లు ఎంత బాధ పడుతున్నారో..?
హైదరాబాదీ బిర్యానీ అంటే నాన్‌వెజ్ ఆహార ప్రియులకు నోరూరిపోతుంది. ఈ బిర్యానీ టేస్ట్ అలాంటిది. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు. ఈ బిర్యానీకి ప్రపంచమంతా అభిమానులున్నారు. ఇలా నోరూరించే బిర్యానీ, ఎవరికీ పనికి రాకుండా ఊరికే నీళ్లకో కొట్టుకుపోతే..అయ్యయ్యో ఎంత పనైపోయిందే అని బాధ పడిపోతారు ఈ డిష్ లవర్స్. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇదే జరిగింది. భారీగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ వరద నీరు పారుతోంది. నవాబహ్ సాహెబ్ కుంటలోని ఓ హోటల్‌లోనూ భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆ సమయంలో బిర్యానీతో ఉన్న రెండు పెద్ద గిన్నెలు ఆ వరద ధాటికి నీళ్లలో కొట్టుకుపోయాయి. హోటల్ ముందు నుంచే నీళ్లలో తేలుతూ వెళ్తుండటం చూసి స్థానికులు కొందరు వీడియో తీశారు. "ఈ బిర్యానీ ఆర్డర్ చేసిన వాళ్లు ఎంత బాధ పడుతున్నారో" అని ఓ వ్యక్తి వీడియో పోస్ట్ చేశాడు. బిర్యానీ లవర్స్ అంతా ఈ వీడియో చూసి తెగ బాధ పడిపోతున్నారు. "ఈ బిర్యానీ ఎవరికి దక్కుతుందో" అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు 9 లక్షల వ్యూస్ వచ్చాయి. వందలాది మందిం కామెంట్లు చేస్తున్నారు. కొందరు దీన్ని "ఫ్లోటింగ్ బిర్యానీ" అని పిలుస్తున్నారు. కొందరు "సారీ జొమాటో, స్విగ్గీ, డుంజో" అంటూ ఫుడ్ డెలివరీ యాప్స్‌ను ట్యాగ్ చేస్తూ ఫన్నీగా స్పందిస్తున్నారు.
A strong independent biryani that needs no man pic.twitter.com/KQhnJOMfKv
— Sameer S (@Naa_Cheese) July 30, 2022
Somebody is going to be unhappy for not getting his biryani order.#Hyderabad #HyderabadRains pic.twitter.com/OPdXsjSoKs
— Ibn Crowley (@IbnFaraybi) July 28, 2022
#Waterlogging and #Vessels were washed away and floating on the rain water, infront of #AbidaHotel at #Shastripuram in Hyderabad, due to #HeavyRains for one hour only, today evening.#HyderabadRains #Telanganarains #HeavyRain #Hyderabad pic.twitter.com/gy8q7A72qT
— Surya Reddy (@jsuryareddy) July 28, 2022
Also Read: NTR Daughter Suicide : ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య
Also Read: Viral News: 'మీరు పెన్సిల్ రేటు పెంచడం వల్ల మా అమ్మ కొట్టింది'- ప్రధాని మోదీకి చిన్నారి లేఖ