Viral News: 'మీరు పెన్సిల్ రేటు పెంచడం వల్ల మా అమ్మ కొట్టింది'- ప్రధాని మోదీకి చిన్నారి లేఖ
Viral News: ఓ ఆరేళ్ల చిన్నారి.. ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖ వైరల్ అవుతోంది.
Viral News: రాజకీయ నాయకులకు చాలా మంది బహిరంగ లేఖలు రాస్తుంటారు. తమ ఊర్లో సమస్యల గురించి లేదా వ్యక్తిగత సాయం కోసమో ఇలా లేఖలు రాయడం సహజం. అయితే ఓ చిన్నారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసింది. ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఇలా రాసింది
ఉత్తర్‌ప్రదేశ్ కన్నౌజ జిల్లా చిబ్రమౌ పట్టణానికి చెందిన కృతి దూబే అనే ఆరేళ్ల బాలిక ప్రధాని మోదీకి లేఖ రాసింది. పెరుగుతున్న ధరల వల్ల కలుగుతున్న కష్టం గురించి ఆ లేఖలో తెలియజేసింది. పెన్సిల్, రబ్బర్ ధరలు కూడా పెరిగాయని, మ్యాగీ రేటు కూడా విపరీతంగా పెరిగిందని ఆ లేఖలో ప్రస్తావించింది. ధరలు పెరగడం వల్ల తన తల్లి తనను కొట్టిందని లెటర్‌లో పేర్కొంది.
Six-year-old girl of Class 1 has written a letter to PM Modi about hardship she is facing due to price rise. The girl, Kriti Dubey, of Chhibramau town in UP's Kannauj,wrote in her letter, "My name is Kriti Dubey.I study in class 1.Modiji, you have caused immense price rise. pic.twitter.com/vj9o9TZuZf
— Aroone Harry (@arunharimowar) August 1, 2022
వైరల్
"ఇది నా చిన్నారి కూతురు మన్‌కీ బాత్ (మనసులో మాట)" అంటూ ఈ లేఖను చిన్నారి తండ్రి విశాల్ దూబే (లాయర్) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హిందీలో రాసిన ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
చిన్నారి లేఖ గురించి చిబ్రామౌ ఎస్‌డీఎం అశోక్ కుమార్ స్పందించారు. ఆ బాలికకు ఏ విధంగానైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఆమె లేఖను సంబంధిత అధికారులకు చేరేందుకు ప్రయత్నిస్తానన్నారు.
Also Read: BJP-JD(U): నితీశ్ కుమార్ యూటర్న్- లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, జేడీయూ కలిసే బరిలోకి!