Viral News: ఇవి అలాంటిలాంటి షూస్ కాదండోయ్ - పడగెత్తిన షూస్, చూస్తే వావ్ అనాల్సిందే!
Viral News: వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి కింగ్ కోబ్రా బూట్లు ధరించి కనిపించాడు. ఈ బూట్లను చూసిన చాలా మంది వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Viral News: నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కొందరు తమ వ్యక్తిత్వం, ఆలోచనలు, చేసే పనుల ద్వారా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటే.. మరికొందరు మాత్రం తమ వేషభాష ద్వారా ప్రత్యేకంగా ఉండాలని ఆశిస్తారు. రోడ్డుపై వెళ్తుంటే తమ స్టైల్, వెరైటీ వేర్ చూడాలని కోరుకుంటారు. అలాంటి ధోరణి యువతలో ఎక్కువగా కనిపిస్తుంది.
ప్రత్యేకంగా ఉండాలని ఆసక్తి
టీనేజ్ లో ఉన్నప్పుడు వెరైటీగా అలాగే ట్రెండీగా ఉండాలని చాలా మంది యువతీ యువకులు తపిస్తుంటారు. పై నుండి కింది వరకు ఏదైనా ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే కురాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు. షర్ట్స్, ప్యాంట్స్, జీన్స్, హ్యాట్స్, షూస్ ఇలా ప్రతి ఒక్కటీ వెరైటీ గా ఉండాలని ఆశిస్తారు.
ఇదెక్కడి ఐడియారా బాబు
ఈ ఇంటర్ నెట్ యుగంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇలాంటి ప్రత్యేకత కలిగి దుస్తులు, వాటిని ధరించిన వ్యక్తులు చాలా మంది కనిపిస్తారు. కొన్ని వీడియోలైనా, ఫోటోలైనా చూస్తే ఇదెక్కడి ఐడియారా బాబు అనేలా ఉంటాయి. ఈ వింత ఆలోచనలు ఎలా వస్తాయిరా అయ్యా అనే సందర్భాలు చాలా ఎదురవుతాయి.
వావ్ అనిపించే షూ డిజైన్
ఇలా ప్రత్యేకంగా కనిపించాలనుకునే చాలా మంది చేసే మొదటి పని తమ ఫ్యాషన్ ను మార్చుకోవడం. అలా ఒక కాలికి ఒక రంగు షూ వేసుకుంటే మరో కాలికి ఇంకో రంగు షూ వేసుకుంటారు. అలా కుర్రాళ్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో డిజైనర్స్ కూడా తమ ప్రొడక్ట్స్ ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతుంటారు. అలాంటి ఒక ప్రొడక్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలోని కంటెంట్ కొంతమందిని భయపెడితే, మరికొందరికి వావ్ అనే ఫీలింగ్ ను ఇస్తుంది.
fashion anyone??? pic.twitter.com/IfzXx1EWZo
— ViralPosts (@ViralPosts5) February 7, 2023
వైరల్ గా మారిన 'కింగ్ కోబ్రా'
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి కింగ్ కోబ్రా డిజైన్ తో ఉన్న బూట్లు ధరించాడు. సరదాకి మధ్యలో రెండు పాములు నిల్చున్నట్లు ఉండేలా బూట్ల డిజైన్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో క్లిప్ లో కింగ్ కోబ్రా లాంటి షూలను రెండింటిని చూడొచ్చు.
కింగ్ కోబ్రా షూలపై నెటిజన్ల స్పందన
ఈ వీడియో ఇప్పటి వరకు వేలాది మంది చూశారు. ఇంకా చూస్తూనే ఉన్నారు. ఈ పోస్టుపై చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ కింగ్ కోబ్రా షూలను చూసి చాలా మంది ఆశ్చర్యపోయినట్లు వెల్లడించారు. చాలా మంది యూజర్స్ ఈ బూట్లను చూసి భయపడ్డామని కామెంట్లు చేస్తున్నారు. కొంత మంది ఈ బూట్లు పెద్దగా ఆకట్టుకోలేదని, భయపెట్టలేక పోయాయని కామెంట్లు పెట్టారు. ఏది ఏమైనా ఈ కింగ్ కోబ్రా బూట్లు ఉన్న వీడియోకు వేలల్లో లైక్స్ వచ్చాయి. అంతే సంఖ్యలో షేర్ కూడా అవుతోంది. ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో కనిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

