అన్వేషించండి

Viral News: సైకిల్ చక్రంలా గిర్రున తిరుగుతున్న చిన్నారి టాలెంట్‌ చూస్తే మతిపోతుంది- వైరల్ అవుతున్న వీడియో

Viral News: సోషల్ మీడియోలో ఓ చిన్నారి వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో ఉన్న చిన్నారి చిచ్చరపిడుగులా జిమ్నాస్టిక్స్ చేసి నెటిజన్లను ఆకట్టుకుంది.

Viral News: సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది టాలెంట్ గురించి బయటకు తెలుస్తోంది. పాట అయినా, డ్యాన్స్ అయినా, ఆటలు అయినా, ఇంకేదైనా సరే.. ఇలా సోషల్ మీడియాలో పెట్టేస్తే అలా వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకరి టాలెంట్ గురించి నలుగురికి తెలిసి అవకాశాలు అందివస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. పాటలకు డ్యాన్స్, సినిమా డైలాగ్ లకు ఎక్స్‌ప్రెషన్స్‌ తో కూడిన లిప్ మూమెంట్, ఫ్రాంక్ వీడియోలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ స్టఫ్ గురించి పక్కన పెడితే కొందరు వారి నైపుణ్యాలను ప్రదర్శిస్తూ చేసే వీడియాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయి. ఈ వీడియోలు ఎంతో మందిని ఆకట్టుకుంటాయి. చాలా మంది నుంచి ప్రశంసలు లభిస్తాయి. అందులో కొంత మంది అవకాశాలు కూడా అందిస్తారు. చాలా మందికి టాలెంట్ ఉంటుంది. కానీ దానిని ఎలా వాడాలో, ఎలా మరింత మెరుగుపడాలో తెలియక ఉన్న చోటనే ఉండిపోతారు. కొందరు టాలెంట్ ఉన్నా, వెళ్లే దారి తెలిసి కూడా డబ్బులేక, సరైన ప్రోత్సాహం లేక వెనకబడిపోతారు. అలాంటి వారి వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చినప్పుడు వాటికి వివిధ వర్గాల నుంచి వచ్చే ప్రశంసలు వారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిన్నారి తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఇంట్లో ఉన్న సోఫాలపై ఆ చిన్నారి జిమ్నాస్టిక్స్ తరహాలో ఫ్లిప్స్ వేసింది. ఒక చివరి నుంచి విన్యాసాలు మొదలు పెట్టిన చిచ్చరపిడుగు. మరో చివరకు వచ్చి అక్కడ అద్భుతమే చేసింది. చూసే వాళ్లకే కళ్లు అలసిపోయేలా బైర్లు కమ్మే రీతిలో ఫ్లిప్స్ వేసింది.

55 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో ఆ చిచ్చర పిడుగు ఏకంగా 82 బ్యాక్ ఫ్లిప్స్ చేసింది. ఈ ఫ్లిప్స్ వేస్తున్నప్పుడు శరీరం బ్యాలెన్స్ చేసుకోవడం చాలా చాలా కీలకం. ఫ్లిప్స్ వేయడం ఎంత ముఖ్యమో చివర్లో ఎండింగ్ కూడా అంతే పర్ఫెక్ట్ గా రావాల్సి ఉంటుంది. బ్యాక్ ఫ్లిప్స్ ఎంత పర్‌ఫెక్ట్ గా చేసిందో.. అంతే పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయింది ఈ చిచ్చర పిడుగు.

ఇప్పుడు ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంత చిన్న వయస్సులోనే ఇంత పర్ఫెక్ట్ గా ఫ్లిప్స్ వేయడం పట్ల చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిన్నారి కాబోయే ఒలింపిక్ పార్టిసిపెంట్ అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా అద్భుతంగా బ్యాక్ ఫ్లిప్స్ వేశావని, 82 ఫ్లిప్స్ వేయడం మాటలు కాదని వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ అంటూ మరొకరు కామెంట్ పెట్టారు. ఇంక్రిడిబుల్ టాలెంట్ అంటూ మరొకరు పొగిడారు. అయితే ఈ వీడియో ఎవరు తీశారు, ఈ వీడియోలో ఉన్న ఆ చిన్నారి చిచ్చరపిడుగు ఎవరు అనేది మాత్రం తెలియదు. ఈ వీడియోను నేహా అగర్వాల్ అనే ట్విట్టర్ యూజర్ జూన్ 22, 2023 సాయంత్రం 4.37 కు పోస్టు చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 139.9K వ్యూస్ వచ్చాయి.

టాప్ హెడ్ లైన్స్

Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget