Furry Snake - వీడియో: ఈ పామును చూశారా, బొచ్చు కుక్కలా భలే క్యూట్‌గా ఉంది కదూ!

థాయ్‌లాండ్‌లో కనిపించిన ఈ బొచ్చు పామును ఏలియన్ స్నేక్ అని అంటున్నారు. ఇలాంటి పామును మీరు ఎక్కడైనా చూశారా?

FOLLOW US: 

Furry Green Snake | పాములంటే పొలుసులతో మిలమిలా మెరుస్తూ.. చూస్తేనే ఒళ్లు జలదరించేలా ఉంటాయి కదూ. అయితే, ఈ పాము ఆ టైపు కాదు. బొచ్చు కుక్కలా భలే క్యూట్‌గా ఉంటుంది. ఒళ్లంతా పొలుసులకు బదులు వెంటుకలు ఉంటాయి. పచ్చ రంగులో కనిపించే ఈ పాము ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

థాయ్‌లాండ్‌లోని ఓ కొలనులో కనిపించిన ఈ పామును చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అకస్మాత్తుగా చూస్తే.. ఇదేదో పెద్ద సైజు గొంగలి పరుగు కావచ్చని అనుకుంటాం. కానీ, దీని నోటిని చూశాక అభిప్రాయం మార్చుకుంటాం. ఎందుకంటే, దీనికి పాము తరహాలోనే నాలుక ఉంది. పాములాగానే గింగిరులు తిరుగుతోంది. దానితోపాటు దాని బొచ్చు కూడా సొగసుగా కదులుతోంది. 

సాఖోన్ నఖోన్ ప్రాంతంలో నివసిస్తున్న 49 ఏళ్ల తు అనే వ్యక్తికి ఈ పాము కనిపించింది. అది ఏ రకం పామో తెలియపోవడం వల్ల దాన్ని ఏలియన్ స్నేక్ అని పిలుస్తున్నారు. అధికారులకు చూపించడం కోసం తు ఆ పామును తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. స్థానికులు దీన్ని బొచ్చు పాము అని పిలుస్తున్నారు. కొందరు వాటర్ స్నేక్ అని అంటున్నారు. అయితే, ఆ పాము సొంత బొచ్చు కాకపోయి ఉండవచ్చని కొందరు అంటున్నారు. 

Also Read: ఓ మై గాడ్, ఇతడి నాలుకపై జుట్టు పెరుగుతోంది, కారణం తెలిస్తే ఇక నిద్రపట్టదు!

ఇలాంటి పాములు నీళ్లలో రాతి పగుళ్లలో నివాసం ఉంటాయని, దాని వల్ల వాటి శరీరంపై నాచు పేరుకుపోతుందని, అందుకే ఈ పాము అలా పచ్చ రంగులో కనిపిస్తోంది కాబోలు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ పాములను మాస్క్డ్ వాటర్ స్నేక్ అని కూడా అంటారని నిపుణులు తెలుపుతున్నారు. ఇది ఎక్కువగా ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపించే హోమలోప్సిడే కుటుంబానికి చెందిన తేలికపాటి విషపూరిత పాము జాతికి చెందిన పామై ఉండవచ్చని అంటున్నారు. 
వీడియో: 

Also Read: చంకల్లో పౌడర్ పూయడం మంచిదేనా? అక్కడ నల్లగా ఎందుకు మారుతుంది?

Published at : 14 Mar 2022 11:24 AM (IST) Tags: Furry Snake Furry Green Snake Thailand Furry Snake Furry Snake Video

సంబంధిత కథనాలు

Amalapuram Violence : పోలీసుల వలయంలోనే అమలాపురం, మరో 46 మందిపై కేసు, ఎఫ్ఐఆర్ లో ప్రముఖుల పేర్లు

Amalapuram Violence : పోలీసుల వలయంలోనే అమలాపురం, మరో 46 మందిపై కేసు, ఎఫ్ఐఆర్ లో ప్రముఖుల పేర్లు

Man Cut in Half: ప్రాణం పోసిన ప్రేమ, ప్రమాదంలో శరీరం సగానికి ముక్కలైనా జీవిస్తున్న యువకుడు

Man Cut in Half: ప్రాణం పోసిన ప్రేమ, ప్రమాదంలో శరీరం సగానికి ముక్కలైనా జీవిస్తున్న యువకుడు

Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Six Ride On Activa: ఒకే స్కూటర్‌పై ఆరుగురు జర్నీ, ఒకరి భుజంపై మరొకరు ఎక్కి మరీ ప్రయాణం

Six Ride On Activa: ఒకే స్కూటర్‌పై ఆరుగురు జర్నీ, ఒకరి భుజంపై మరొకరు ఎక్కి మరీ ప్రయాణం

Japan Dog Man: కుక్క జీవితం, పూర్తిగా శునకంలా మారిపోయిన మనిషి - జపాన్‌లో డాగ్ మ్యాన్!

Japan Dog Man: కుక్క జీవితం, పూర్తిగా శునకంలా మారిపోయిన మనిషి - జపాన్‌లో డాగ్ మ్యాన్!

టాప్ స్టోరీస్

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

NTR Centenary Celebrations : ఎన్టీఆర్ అప్పట్లోనే చేసి చూపించారు - అవినీతికి పాల్పడితే మంత్రినీ వదల్లేదు !

NTR Centenary Celebrations :   ఎన్టీఆర్ అప్పట్లోనే చేసి చూపించారు - అవినీతికి పాల్పడితే మంత్రినీ వదల్లేదు !