Viral Video: తిక్క కుదిరింది, చనిపోయినట్ల ప్రాంక్ వీడియో.. అరెస్ట్ చేసిన పోలీసులు
Prank Video : ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం ఓ యువకుడు ‘శవం’ అవతారమెత్తాడు. ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో జరిగిన ఈ వింత సంఘటనలో పాపులారిటీ కోసం మనోడు విచిత్రమైన అవతారం ఎత్తాడు.
Viral Video : ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొంత మంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ముఖ్యంగా రీల్స్ చేస్తూ బాగా ఫేమస్ అవ్వాలని ఎంతోమంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మామూలుగా రీల్స్ చేస్తే ఎవరూ చూడరని కాస్త వెరైటీగా వీడియోలు చేయాలని కొత్త కొత్త చెత్త ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్న వారు కూడా ఎందరో. అంతేకాదు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. మరికొందరైతే రోడ్లపై పబ్లిక్ లో రొమాన్స్ చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పాపులర్ కావడానికి కూడా ప్రయత్నించారు.
రీల్స్ పిచ్చితో కుటుంబం బలి
ఇటీవల కాలంలో రీల్స్ పిచ్చి ఓ కుంటుంబాన్ని బలితీసుకుంది. సోషల్ మీడియాను అడ్డదారిలో వాడిన ఓ బాలుడు తాను దుర్మరణం చెందడంతోపాటు తల్లిదండ్రుల చావులకు ప్రత్యక్షంగా కారణమయ్యాడు. ఏకంగా రైలు వస్తున్నపుడు పట్టాలపై నిలబడి వీడియో తీసి నెట్టింట్లో సంచలనం క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో అదే రైలు కిందపడి కుటుంబం మొత్తం నలిగిపోయారు. ఇందుకు సంబంధించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. తాజా అదే ఉత్తర ప్రదేశ్ లో ఓ యువకుడి చేసిన పనికి పోలీసులు తగిన శాస్తి చేశారు.
ఇన్ స్టాగ్రామ్ పిచ్చి
ఇటీవల కొంత మంది యువత ఓవర్ నైట్ పాపులర్ అవ్వాలని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చిలో పడిపోతున్నారు. లైకులు కామెంట్ల కోసం పరితపిస్తున్నారు. మరికొందరు అదే రీల్స్ పేరుతో పిచ్చి చేష్టలు చేస్తూ ఎదుటివారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. తమను తాము మర్చిపోతూ రోడ్లపై రీల్స్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, అలాంటి ఓ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం ఓ యువకుడు ‘శవం’ అవతారమెత్తాడు. ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో జరిగిన ఈ వింత సంఘటనలో పాపులారిటీ కోసం మనోడు విచిత్రమైన అవతారం ఎత్తాడు. ముఖేష్ కుమార్ అనే 23ఏళ్ల వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం రోడ్డు మధ్యలో పడుకుని చనిపోయినట్లు నటించాడు.
Reel क्या न करा दे...
— Sachin Gupta (@SachinGuptaUP) September 15, 2024
उत्तर प्रदेश के जिला कासगंज में एक युवक ने चौराहे पर लेटकर मरने का ढोंग किया। पुलिस ने रीलपुत्र मुकेश कुमार को गिरफ्तार किया। pic.twitter.com/3JfDbIYYy0
ముక్కులో దూది.. బాడీపై గులాబీ పూలు
రోడ్డులో ఒకవైపు బారీకేడ్ పెట్టి బ్లాక్ చేసి దాని సపోర్ట్ తీసుకుని అంతక్రియాలు జరిపే సీన్‌ల.. కదలకుండా శవం మాదిరి తెల్లటి వస్త్రం వేసుకుని పడుకున్నట్లు నటించాడు. తనపై తెల్లని దుప్పటి, ముక్కులో దూది, మెడలో దండ, దుప్పటిపై గులాబీ పూలు లాంటివి వీడియోలో కన్పిస్తున్నాయి. వీడియో అయిపోగానే పగలబడి నవ్వుతూ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. అది చూసిన స్థానికులు విచిత్రమైన ఘటన చూసి షాక్ తిని అధికారులకు సమాచారం అందించారు. ఈ వీడియోను కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనికి సంబంధించిన వైరల్ కావడంతో తాజాగా స్థానిక పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
जनपद के थाना कासगंज स्थित राजकोल्ड चौराहे पर एक युवक द्वारा अपने को शव जैसा प्रदर्शित करते हुए रील शूट किये जाने के सम्बन्ध में श्री राजेश भारती, अपर पुलिस अधीक्षक कासगंज द्वारा दी गयी बाईट । pic.twitter.com/xowsDWmGcZ
— KASGANJ POLICE (@kasganjpolice) September 15, 2024