Snake Cut In Half: రెండు ముక్కలైనా బతికేసిన నాగుపాము, వీడియో వైరల్
ఆ పాము రెండు ముక్కలైనా బతికే ఉంది. ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. కానీ, ఆ పాము 4 గంటలు మాత్రమే బతికి ఉందట.
Snake Death | పాములను చూస్తే ఎవరికైనా భయమే. అందుకే, అవి కనిపించగానే హడలిపోతారు. దీంతో చాలామంది పాములను చంపేస్తుంటారు. అయితే, స్నేక్ లవర్స్ మాత్రం వాటిని చంపడం చాలా పాపమని, తమకు సమాచారం అందిస్తే.. వాటిని పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదిలిపెడతామని చెబుతారు. తమ ప్రాణాలకు తెగించి మరీ పాములను రక్షిస్తారు. అయితే, మహారాష్ట్రలోని నాసిక్ శివారులో ఓ పాము అనుకోకుండా ప్రమాదంలో పడింది.
పొలం పనుల్లో భాగంగా ఓ రైతు ట్రాక్టర్‌తో మట్టిని దున్నాడు. కాసేపటి తర్వాత కలుపు మొక్కలను ఏరేందుకు వెళ్తుండా ఓ భయానక దృశ్యం కనిపించింది. ట్రాక్టర్‌కు అమర్చిన ఇనుప నాగలి వల్ల ఓ పాము రెండు ముక్కలై.. మట్టిలో చిక్కుకుపోయింది. దీంతో రైతులు హుటాహుటిన సర్ప్‌మిత్ర భరత్ దిగే అనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు.
భరత్ పొలంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న పాము శరీరాన్ని చూసి రెండు పాములు ఉన్నాయని అనుకున్నాడు. దగ్గరకు వెళ్లి చూస్తే.. ఒకే నాగుపాము రెండు ముక్కలైందని తెలుసుకుని బాధపడ్డాడు. చిత్రం ఏమిటంటే ఆ పాము అప్పటికీ బతికే ఉంది. రెండు ముక్కల్లో పాము తలవైపు భాగంలో జీవం ఉంది. తోకలో మాత్రం జీవం లేదు. పాము పడగ విప్పుతూ యాక్టీవ్‌గానే కనిపించింది.
Also Read: వేసవిలో ఫ్యూయెల్ ట్యాంక్ నిండా ఇంధనం నింపితే పేలిపోతుందా? ఈ మెసేజ్‌లో నిజమెంతా?
ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ.. ‘‘పాము రెండు ముక్కలైన తర్వాత బతికే అవకాశాలు చాలా తక్కువ. అయితే, ఈ పాము కూడా ఎంతో సేపు బతకదు, చనిపోతుంది’’ అని తెలిపాడు. భరత్ తెలిపినట్లే ఆ పాము నాలుగు గంటల తర్వాత చనిపోయింది. రెండు ముక్కలు కావడం స్పర్శ కోల్పోయి కదల్లేని స్థితిలో పడగ విప్పి దిక్కులు చూస్తున్న ఆ పామును చూస్తే తప్పకుండా మనసు కరుగుతుంది. అయితే, పాము తమ వల్లే చనిపోయిందని, ఆ పాపం తమని చుట్టుకుంటుందని రైతు కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, అది ప్రమాదవసాత్తు జరిగిందని, ఇందులో రైతు తప్పు ఏమీ లేదని భరత్ తెలిపాడు. ఏడు నెలల కిందట పోస్ట్ చేసిన ఈ వీడియోను నెటిజనులు ఇప్పటి వరకు 17 మిలియన్ సార్లు వీక్షించారు.
Also Read: ఏసీని 24 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో పెడుతున్నారా? అయితే, ముప్పే!
వీడియో (ఈ వీడియోలోని దృశ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేయవచ్చు. ధైర్యం ఉంటేనే చూడండి):