Rachakonda Police: 'అందుకనే భార్యను అర్ధాంగి అంటారు' - రాచకొండ పోలీసుల ట్వీట్ వైరల్
Telangana News: సైబర్ నేరాలపై రాచకొండ పోలీసులు వినూత్న ట్వీట్‌తో అవగాహన కల్పించారు. 'అందుకేగా భార్యను అర్ధాంగి అంటారు' అంటూ కాస్త హాస్యాన్ని కూడా జోడించారు. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
Rachakonda Police Awareness On Cyber Crimes: ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో రాచకొండ పోలీసులు (Rachakonda Police) ఓ వినూత్న ట్వీట్‌తో అవగాహన కల్పించారు. ఓ కపుల్ జోక్‌తో కాస్త హాస్యాన్ని జోడించి మరీ.. బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీ ఎవరికీ చెప్పొద్దని వివరించారు. సైబర్ నేరాల పట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. బ్యాంకు సిబ్బంది అంటూ ఓటీపీ వివరాలు అడిగిన వారికి ఓ మహిళ ఇచ్చిన సమాధానానికి హాస్యబరితంగా వివరిస్తూ.. 'అందుకనే కదా భార్యను అర్ధాంగి అంటారు' అంటూ ట్వీట్ చేశారు. 'బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు, ఏటీఎం లేదా క్రెడిట్ కార్డు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. తెలివిగా ఆలోచించండి. అప్రమత్తంగా ఉండండి.' అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Don't share your Bank Account details, OTP, ATM, or Credit card details with anyone. Be Alert, Be Smart.
— Rachakonda Police (@RachakondaCop) June 19, 2024
#onlinefrauds #cybercrime #bealert pic.twitter.com/foqu80ZgUe
Also Read: Telangana SI Dismiss: ఎస్సైపై లైంగిక ఆరోపణలు: సీఎం రేవంత్ సీరియస్ - డిస్మిస్ చేసేయాలని ఉత్తర్వులు!