Viral Video: భయమంటే తెలియని బ్లడ్ అతనిది - భారీ కొండచిలువను ఏం చేశాడో చూడండి
Python Viral Video : ఎలాంటి భయం లేకుండా ఒంటి చేత్తో కాలువ నుంచి భారీ కొండచిలువను బయటకు లాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Python Viral Video : పాములు, మొసళ్లు అంటే చాలా మందికి భయం ఉంటుంది. కొందరైతే పేరు వింటేనే గజగజ వణికిపోతూంటారు. అలాంటిది ఓ వ్యక్తి చేతులకు కనీసం ఎలాంటి తొడుగులు ధరించకుండా కాలువ నుంచి ఓ భారీ కొండచిలువను లాగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది క్షణాల్లో మిలియన్ల మందిని ఆకర్షించింది. ఇందులో ఓ వ్యక్తి కాలువలోకి దిగి, కొండచిలువను జాగ్రత్తగా పైకి లాగడం చూడవచ్చు.
కొండచిలువ అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ వ్యక్తి నేర్పుగా దాని దాడిని నుంచి తప్పించుకున్నాడు. ఇది అతని నైపుణ్యం, విశ్వాసాన్ని ప్రస్ఫుటంగా చూపితోంది. వ్యూహాత్మక ఎత్తుగడలతో, అతను ధైర్యం, నైపుణ్యం రెండింటినీ ప్రదర్శిస్తూ కాలువ నుంచి కొండచిలువను పూర్తిగా వెలికితీయడం అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. 'విశాల్ స్నేక్ సేవర్' అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో, ఇప్పటి వరకు 36 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. ఆపద ఎదురైనప్పుడు ఈ వ్యక్తి ప్రశాంతంగా ఉండడం వీక్షకుల నుండి ప్రశంసలు, అపనమ్మకం రెండింటినీ రేకెత్తించింది.
View this post on Instagram
నెటిజన్లు ఏమన్నారంటే..
ఈ వీడియోకు ఆన్‌లైన్‌లో అనేక కామెంట్స్ వచ్చాయి. ఆ వ్యక్తి నిర్భయతను చూసి కొందరు యూజర్లు విస్మయం, అవిశ్వాసం వ్యక్తం చేశారు. ఒకరు, “నేను నా జీవితంలో చూసిన నిజమైన హీరో” అని అన్నారు. “అతను అంత ప్రశాంతంగా ఎలా ఉన్నాడు? నేనైతే చాలా భయపడతాను!" అని మరొకరన్నారు. ఇంకొందరేమో అతని నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. “ఈ వ్యక్తి తప్పనిసరిగా ప్రొఫెషనల్ అయి ఉండాలి. మామూలు వాళ్లయితే ఇంత పెద్ద పామును హ్యాండిల్ చేయగలరని నేనైతే నమ్మను” అని ఒకరు రాశారు. కొంతమంది ఆ పరిస్థితిలో భద్రతను కూడా ప్రశ్నించారు. "పైథాన్‌ను ఇంత ఈజీగా బయటకు తీస్తారని నాకు నాకు నిజంగా తెలియదు. కానీ ప్రమాదకరంగా కూడా మారవచ్చు" అని మరొకరన్నారు. ఇది ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, ఇలాంటి అడవి జంతువులను పట్టుకోవడం ప్రమాదకరమని గుర్తు పెట్టుకోవాలని ఇంకొకరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read : Viral News: నర్సీపట్నంలో కత్తితో తిరుగుతూ యువతి హల్‌చల్, ఆమె మాటలు విని అంతా షాక్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

