ITBP Viral Video: గస్తీ మే సవాల్! చైనా సరిహద్దుల్లో 15 వేల అడుగుల ఎత్తులో ఐటీబీపీ జవాన్ల పహారా
ఉత్తరాఖండ్ వద్ద ఉన్న హిమాలయాల్లో ఐటీబీపీ జవాన్లు పహారా కాస్తున్న వీడియో వైరల్‌గా మారింది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో వారు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
శీతాకాలం వస్తే ఉదయాన్నే లేవాలని కూడా సాధారణంగా అనిపించదు. అలాంటిది చలికి ఎముకలు కొరుకుతోన్న చలించకుండా దేశ సరిహద్దుల్లో జవాన్లు పహారా కాస్తుంటారు. సరిహద్దుల్లో శత్రువులు, ఉగ్రవాదులతోనే కాకుండా ప్రతికూల వాతావరణంతో వాళ్లు పోరాడుతుంటారు. ఉత్తరాఖండ్ హిమాలయాల్లో మైనస్ డిగ్రీల వాతావరణంలో ఐటీబీపీ జవాన్లు పహారా కాస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
हिमाद्रि तुंग श्रृंग से प्रबुद्ध शुद्ध भारती
— ITBP (@ITBP_official) February 17, 2022
स्वयं प्रभा समुज्ज्वला स्वतंत्रता पुकारती...
When the Going Gets Tough, the Tough Get Going#Himveers of ITBP negotiating a snow bound area at 15 K feet in sub-zero temperatures around in Uttarakhand Himalayas
शौर्य,दृढ़ता,कर्मनिष्ठा pic.twitter.com/G4axCHbjI1
సలాం సైనిక
మోకాళ్లకు పైగా లోతులో దిగపడిపోయే మంచులో అడుగు తీసి అడుగు ముందుకేయలేని స్థితిలో కూడా మన కోసం తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు జవాన్లు. ఆ సైనికుల కష్టం చూస్తే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లుతాయి. హిమాలయాల్లో ఐటీబీపీ జవాన్లు చైనా సరిహద్దు సమీపంలో ఇలా పహారా కాస్తున్నారు.
ఇండో టిబెటన్–బోర్డర్ పోలీసులు ఇక్కడ పెట్రోలింగ్ చేస్తున్నారు. 15 వేల అడుగుల ఎత్తులోని మంచు ప్రాంతంలో ఐటీబీపీ జవాన్లు కాపలా కాయాలి. అతి తక్కువ ఉష్ణోగ్రతలో, మోకాళ్ల లోతు మంచులో మొక్కవోని దీక్షతో వీళ్లు విధులు నిర్వహిస్తున్నారు.
नदियाँ, पहाड़, बर्फ़ या तूफ़ान। सब चीर के आगे बढ़ते हैं हमारे देश के जवान! 🇮🇳 #ITBP pic.twitter.com/caq872Iqsl
— Gautam Gambhir (@GautamGambhir) February 17, 2022
ఒక్క అడుగు ముందుకు వేయడానికి వాళ్లు పడుతున్న కష్టాన్ని వీడియోలో చూసి నెటిజన్లు 'జై జవాన్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. భుజాన తుపాకులు మోస్తూ కర్ర లాంటి వస్తువును ఊతంగా చేసుకుని, బలమైన రోప్ పట్టుకుని ముందుకు సాగుతున్నారు జవాన్లు. సరిహద్దులోని కీలక ప్రదేశాల్లో జవాన్లు ఇలా పెట్రోలింగ్ చేస్తుంటారు.
Also Read: Private Sector Reservation: ప్రైవేట్ ఉద్యాగాల్లో స్థానికుల రిజర్వేషన్‌పై సుప్రీం కీలక ఆదేశాలు
Also Read: Punjab Assembly 2022: 'నెహ్రూపై నిందలు ఎందుకు? ఏడున్నరేళ్లలో మీరు చేసిందేంటి?'