Railway Punishment Rules: రైలులోని ఏసీ కోచుల్లో బెడ్‌షీట్లు, దుప్పట్లను దొంగలిస్తే ఏమవుతుంది.. ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసా?
Railway Punishment Rules: రైలులోని ఏసీ కోచుల్లో బెడ్‌షీట్లు, దుప్పట్లను దొంగలిస్తే ఏమవుతుంది.. దొంగలించి దొరికితే ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసా?
Railway Punishment Rules: ప్రతి రోజూ లక్షలాది మంది భారతీయ రైల్వేల్లో ప్రయాణిస్తుంటారు. రైలులో ప్రయాణించే వారి కోసం రైల్వే పలు ఏర్పాట్లు చేస్తుందన్న విషయం తెలిసిందే. ఏసీ కోచ్ లలో ప్రయాణించే వారి కోసం టవల్స్, బెడ్ షీట్లు, దుప్పట్లు, దిండ్లు లాంటివి అందుబాటులో ఉంచుంది భారతీయ రైల్వే. అయితే వీటిని ప్రయాణికులు ఎత్తుకుపోయే అవకాశాలు ఎక్కువ. అలా ఏసీ కోచ్ లలోని టవల్స్, బెడ్ షీట్లు, దుప్పట్లు ఎత్తుకుపోవడం వల్ల రైల్వేకు ఏటా లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. బెడ్ షీట్లు, దుప్పట్లతో పాటు స్పూన్లు, కెటిల్స్, ట్యాప్ లు, టాయిలెట్ బౌల్స్ ను దొంగలించడం వల్ల భారీ నష్టాన్ని ఎదుర్కొంటోంది భారతీయ రైల్వే. మరి ఇలా దొంగతనానికి పాల్పడే వారికి ఎలాంటి శిక్ష విధిస్తారు, ఎంత జరిమానా వేస్తారో మీకు తెలుసా?
ఆ మార్గంలోనే దొంతనాలు ఎక్కువ
ఛత్తీస్ గఢ్‌లోని బిలాస్ పూర్ జోన్‌లోని రైళ్లలో ప్రయాణించే వారు ఎక్కువగా దొంగతనానికి పాల్పడుతున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. బిలాస్ పూర్, దుర్గ్ ల నుంచి నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దుప్పట్లు, బెడ్ షీట్లు, దిండ్లు, టవల్స్ చోరీ చేస్తున్నారు. ఈ సంవత్సరం మొదటి 4 నెలల్లో రూ. 55 లక్షల విలువైన వస్తువులు దొంగతనానికి గురయ్యాయని అధికారులు వెల్లడించారు. నాలుగు నెలల్లో రూ.55. 97 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి.
రైల్వే ఆస్తులు దొంగలిస్తే శిక్ష ఏంటి?
రైల్వే వస్తువులను దొంగలించడం అంటే రైల్వే ఆస్తులను కాజేయడం కిందే లెక్క. ఇలాంటి దొంగతనాలకు పాల్పడే వారికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. అలాగే జరిమానా కూడా వేస్తారు. రైల్వే ప్రాపర్టీ యాక్ట్ 1966 ప్రకారం అలాంటి ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Coin On Railway Track: ట్రైన్ ట్రాక్‌పై నాణెం పెడితే రైలు బండి పట్టాలు తప్పుతుందా?
దొంగతనాలు నివారించడానికి రైల్వే ఏం చేస్తోంది?
ఈ దొంగతనాలు నివారించడానికి రైల్వే ఓ ఆలోచనతో ముందుకు వచ్చింది. రైలు తన గమ్యస్థానానికి చేరుకోవడానికి 30 నిమిషాల ముందే రైల్వే ప్రయాణికుల నుంచి బెడ్ రోల్ లను సేకరించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కోచ్ అటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. గమ్యస్థానానికి చేరుకునే 30 నిమిషాల ముందు అటెండెంట్లు బెడ్ షీట్లు, దిండ్లు, దుప్పట్లు అన్నింటిని సేకరిస్తారు.
ఎన్‌ఎమ్‌జీ కోచ్‌లకు కిటికీలు, తలుపులు ఉండవు
సాధారణంగా రైళ్లకు కిటికీలు, తలుపులు ఉంటాయి. గూడ్స్, కార్గో రైళ్లకు కిటికీలు, తలుపులు ఉండవు కానీ, అన్ని రకాల రైళ్లకు ఉంటాయి. అయితే ఈ కిటికీలు, తలుపులు లేని రైళ్లను ఎన్‌ఎమ్‌జీ కోచ్ లు అంటారు. అసలు ఈ ఎన్‌ఎమ్‌జీ కోచ్ లు అంటే ఏంటి? ఈ ఎన్‌ఎమ్‌జీ కోచ్ లను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా? మనం కూర్చుని ప్రయాణించే రైలు కోచ్‌లు కూడా రిటైర్ అవుతాయి. భారతీయ రైల్వేలో ప్రయాణీకులకు సేవలందిస్తున్న ICF కోచ్ 25 సంవత్సరాలుగా ఉపయోగించబడుతుంది. ఈ సమయంలో, ప్రతి 5 లేదా 10 సంవత్సరాలకు ఒకసారి మరమ్మతులు చేస్తుంటారు. 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, ప్యాసింజర్ రైలు నుండి ICF కోచ్ లను తొలగిస్తారు. ఆ తర్వాత, ఈ రిటైర్డ్ కోచ్‌ను NMG (న్యూలీ మాడిఫైడ్ గూడ్స్) రేక్ పేరుతో ఆటో క్యారియర్ గా ఉపయోగిస్తారు. కోచ్ ను NMG గా మార్చినప్పుడు, దాని కిటికీలు, తలుపులు అన్నింటిని మూసేస్తారు. కార్లు, ట్రాక్టర్లు, మినీ ట్రక్కులు వంటి వాహనాలను సులువుగా ఎక్కించుకునేలా, అన్ లోడ్ చేసుకునే విధంగా ఈ వ్యాగన్ లను సిద్ధం చేస్తారు.