Viral Video: కటింగ్ చేపించుకునేందుకు సెలూన్‌కు వెళ్లిన విదేశీయుడు! ఎంత ఛార్జ్ చేశాడో తెలిస్తే షాకవుతారు
కటింగ్ చేపించుకునేందుకు వచ్చిన విదేశీ పర్యాటకుడికి బార్బర్ షాకిచ్చాడు. పెద్ద మొత్తంలో రేటు చెప్పడంతో కంగుతిన్నా బేరం ఆడి కొంచెం తగ్గించుకున్నాడు.

Barber Charges 1800 To A Foreigner Viral Video: ప్రతి సంవత్సరం లక్షలాది మంది విదేశీ పర్యాటకులు భారతదేశంలో పలు ప్రాంతాలు సందర్శించడానికి వస్తుంటారు. ఇటీవల అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ చిలుకూరి దంపతులు తమ పిల్లలతో కలిసి భారత పర్యటనకు వచ్చారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా జైపూర్ , ఆగ్రాలో తాజ్ మహల్ సందర్శించారని తెలిసిందే.
మన దేశం ఎప్పటినుంచో 'అతిథి దేవో భవ' అనే సంప్రదాయాన్ని పాటిస్తుంది. తమ ప్రవర్తనతో వారిని మెప్పించిన వారు ఉన్నారు. కానీ కొన్నిసార్లు కొంతమంది విదేశీ పర్యాటకులతో అనుచితంగా ప్రవర్తించడం చేస్తుంటారు. కొందరు తమ కక్కుర్తి, దురాశ కారణంగా విదేశీయుల మనసులో చెడ్డవారిగా మిగులుతున్నారు. అలాంటి ఘటనకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఒక విదేశీ పర్యాటకుడు కటింగ్ చేయించుకునేందుకు వచ్చి మోసపోయాడు. హెయిట్ కట్ చేసిన బార్బర్ విదేశీయుడు కదా అని ఏకంగా రూ.1800 రూపాలు అడిగాడు. భేరం అడటంలో చివరికి కొంత మొత్తం తగ్గించాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
మీరు సాధారణంగా హెయిర్ కట్ కోసం సెలూన్ కు వెళితే ఎంత చెల్లిస్తారు. మీ ప్రాంతం, నగరాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కో రేటు తీసుకుంటారు. రూ.100 లేకపోతే 200, 300 ఇలా చిన్న షాపుల్లో హెయిట్ కట్ కోసం ఛార్జ్ చేస్తారని తెలిసిందే. హై-ఫై సెలూన్‌కి వెళితే రూ.500, రూ.1000 అంతకంటే ఎక్కువే ఛార్జ్ చేసినా ఆశ్చర్య పోనక్కరలేదు.
View this post on Instagram
విదేశీ పర్యాటకుడి హెయిర్ కట్ ఛార్జీకి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. అది గమనిస్తే ఒక విదేశీ పర్యాటకుడు భారత్‌లోని ఓ నగరంలో కటింగ్ చేయించుకునేందుకు హెయిర్ సెలూన్‌కు వెళతాడు. హెయిట్ కట్ చేపించుకోవాలి, ఎంత ఇవ్వాలని విదేశీయుడు అడుగుతాడు. ఆ బార్బర్ అందుకు ఏకంగా రూ.1800 అడుగుతాడు. మరీ ఎక్కువ చెబుతున్నారు. కొంచెం రేటు తగ్గించాలని బేరం అడతాడు ఆ టూరిస్ట్. చివరకు కేవలం 1200 రూపాయలకే కటింగ్ చేసేందుకు తను ఒప్పుకుంటాడు. ఇందుకు సంబంధించిన ఘటనను ఆ విదేశీ పర్యాటకుడు తన ఫోన్‌లో వీడియో తీశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో చక్కర్లు కొడుతోంది.
పర్యాటకుడు అసంతృప్తి
విదేశీ పర్యాటకుడు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా @georgebxckley లో ఆ వీడియో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కి క్యాప్షన్ ఇలా ఉంది, "నేను టిప్ ఇవ్వబోతున్నాను కానీ అతను దానిని నాశనం చేసుకున్నాడు. ఆసియాలో చాలాచోట్ల ప్రయాణించిన తర్వాత, మీ దగ్గర ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాంటి క్షణాలలో ఒకటి! నేను సెలూన్ వ్యక్తికి టిప్ ఇవ్వాలని మొదట అనుకున్నాను. కానీ అతడికి నిజాయితీ లేదు. హెయిర్ కట్ చేపించుకునేందుకు వెళ్తే చేదు అనుభవం అని రాసుకొచ్చాడు. విదేశీయుడు అని అంత ఎక్కువ ఛార్జ్ చేయడం సరికాదని నెటిజన్లు అంటున్నారు. ఒకవేళ తను హెడ్ మసాజ్ లాంటివి చేయించుకున్నా గరిష్టం రూ.500, 600 వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇలా మాత్రం చేయవద్దు అని అతడికి సూచిస్తూ కామెంట్ చేస్తున్నారు.






















