Exam Cheating Tricks: అరె ఏంట్రా ఇది - ఎగ్జామ్‌లో ఇలా కూడా చీటింగ్ చేస్తారా ! వీడియో వైరల్
పరీక్షలో సృజనాత్మకంగా చీటింగ్ కు పాల్పడిన వీడియో నేటింట్లో వైరల్ అవుతుంది.లాన్స్ అనే ట్విట్టర్ వినియోగదారు వీడియో షేర్ చేసారు.ఇది నైపుణ్యంతో చీటింగ్ కు పాల్పడటం అంటే అని పోస్టు కింద రాసారు.
Video Showing Expert Level Cheating: కొందరు విద్యార్థులకు చిన్నప్పటి నుంచీ పరీక్షలు అంటే భయం. మరికొందరికి రాను రానూ పరీక్షలు ఎలా రాయాలి, ఎలా పాసవ్వాలో అర్థమవుతుంది. కానీ కొందరు ఎన్నటికీ మారరు. అదేనండీ, పరీక్షలు ఎలా నిర్వహించినా సరే చీటింగ్ చేసి పాస్ కావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. పరీక్షలో సృజనాత్మకంగా చీటింగ్ కు పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లాన్స్ అనే ట్విట్టర్ వినియోగదారు తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేశారు. ఇది చాలా క్రియేటివ్‌గా , నైపుణ్యంతో చీటింగ్ చేసి ఎగ్జామ్ రాయడం అంటే ఇదే అని పోస్టు కింద రాశారు.
వీడియో లో ఏముందంటే
ఈ చిన్న వీడియో (Student Exams Video)లో ఒక పెన్సిల్ పోచ్ ను చూపించడం కంటే ముందు ఓ వ్యక్తి మాములుగా ఓ పెన్ను తో ఆడుకోవడం కనిపిస్తుంది. ఆ పెట్టె లో కొన్ని రంగురంగుల పెన్నులు, పెన్సిళ్ళు కనిపిస్తాయి. ఆ చిన్న పోచ్ లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆ పెన్సిళ్ళు ఓ ఫోన్ యొక్క వాల్ పేపర్ గా మారిపోతుంది. అలా ఆ వ్యక్తి పరీక్షలో చీటింగ్ కి పాల్పడుతున్నట్టు వెంటనే మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ విద్యార్థి ఫోన్ యొక్క స్క్రీన్ ను టచ్ చేస్తారో, ఆ ఫోన్ లోని పెన్సిల్ ఫోటో పోయి పరీక్షలో రాయాల్సిన ప్రశ్నలకు జవాబులతో కూడిన ఫోటో గ్యాలరి తెరుచుకుంటుంది. ఈ ట్రిక్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
A master of cheating👍👍👍 pic.twitter.com/nEv3mPvStv
— Funny Animals(💯💯💯Foback) (@Lisa06862244) December 3, 2022
కామెంట్ విభాగంలో చాలా మంది ఇంటర్నెట్ యూజర్లు చాలా కామెంట్లు చేశారు. ఇదేంది ఇది నేను చూడలా అని కొందరు కామెంట్ చేస్తుంటే, చీటింగ్ కు క్రియేటివిటీ తోడైతే ఇలాగే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వీడియోకు మిలియన్ల వ్యూస్ రావడంతో పాటు లక్షల మంది లైక్ కూడా కొట్టారు. ఓపిక ఉన్న నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్ చేసి అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.
నెటిజన్ల స్పందన ఇలా..
వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. ఓ ఇంటర్నెట్ యూజర్ "నేను నా గ్రాడ్యువేషన్ లో నాలుగు సంవత్సరాలు చీటింగ్ చేసి 3.8 జీపీఏ తో పాస్ అయ్యాను. చీటింగ్ చేయడానికి మీరు తెలివైన వారు అయ్యి ఉండాలి. చీటింగ్ చెయ్యడం చీటింగ్ చెయ్యకుండా ఉండటానికి చేసే పనితో సమానంగా కష్టమైన పని"అని కామెంట్ చేశాడు. మరో యూజర్ "మేధావి"అని కామెంట్ చేశారు. మరో యూజర్ "మీ పక్కన వారు ఓ పెన్సిల్ ఇవ్వమని అడగనంత వరకు మంచిదే"అని ఆ చీటింగ్ చేసిన వ్యక్తికి సెటైర్ వేశారు. మరో యూజర్ వ్యంగ్యంగా "చదవడం కన్నా ఇలాంటి సృజనాత్మక ఆలోచనలతో ఎగ్జామ్‌కు రావడం చాలా సులువు" అని అభిప్రాయపడ్డారు.