అన్వేషించండి

Viral Video: ఎదురుగా మద్యం కనపడితే ఆగలేకపోయారు - ఏకంగా పోలీసుల సమక్షంలోనే మద్యం సీసాలతో ఉడాయించారు, వైరల్ వీడియో

Andhra News: పోలీసులు రహదారిపై మద్యం సీసాలను ధ్వంసం చేస్తుండగా మందుబాబులు చూస్తూ ఉండలేకపోయారు. ఒక్కసారిగా గుంపులుగా చేరి వాటిని ఎత్తుకెళ్లారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Drunkards Loot Seized Liquor In Guntur: రహదారిపై భారీగా మద్యం సీసాలను పెట్టి ధ్వంసం చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అది చూస్తూ మందుబాబులు ఆగలేకపోయారు. 'సారీ సార్ మేం ఆగలేం' అంటూ ఏకంగా పోలీసుల సమక్షంలోనే మద్యం బాటిళ్లు తీసుకుని ఉడాయించారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లావ్యాప్తంగా (Guntur District) రూ.50 లక్షల విలువైన 24,031 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సోమవారం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నల్లచెరువులోని డంపింగ్ యార్డులో ధ్వంసం చేయడం ప్రారంభించారు. అయితే, యార్డు పరిసరాల్లోని మందుబాబులు ఈ దృశ్యాలను చూసి తట్టుకోలేకపోయారు. 

సాధారణంగా పోలీసులు ఇలాంటి సందర్భాల్లో రోడ్డు రోలర్‌తో మద్యం సీసాలను ధ్వంసం చేస్తారు. అయితే, ఈసారి పొక్లెయిన్‌తో సీసాలను ధ్వంసం చేసేందుకు యత్నించగా.. అవి పగలగొట్టేందుకు సమయం పట్టింది. మందు బాటిళ్లను ధ్వంసం చేయడం ప్రారంభించిన కొద్దిసేపటికే ఉన్నతాధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే అదనుగా భావించిన మందుబాబులు ఒక్కసారిగా గుంపులుగా అక్కడికి చేరుకుని మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. పోలీసులు అడ్డుకునేందుకు యత్నించినా.. వారి ముందే సీసాలను ఎత్తుకెళ్లారు. వారిని నిలువరించడం పోలీసులకు కష్ట సాధ్యమైంది. 

Also Read: Prakasam Barrage Issue : ప్రకాశం బ్యారేజీ కూల్చివేతకు వైసీపీ భారీ కుట్ర - దేశద్రోహమే - ఏపీ హోంమంత్రి తీవ్ర ఆరోపణలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Rohit Sharma: రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Embed widget