కరోనాకు భయపడి ఆక్సిజన్ సిలిండర్లు, మెడిసిన్ కొంటున్న ప్రజలు.? ఇలా చేయడం ఎంత వరకు సేఫ్.?
చైనాలో ఒమిక్రాన్ BF-7 వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మరీ ముఖ్యంగా చైనాలో కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రికార్డ్ స్థాయిలో 3కోట్ల 70లక్షల మందికి కరోనా సోకినట్టు తెలుస్తోంది.
ఏదైతే.. మళ్లీ వినకూడదనుకున్నామో... ఏదైతే మళ్లీ చూడకూడదని అనుకున్నామో.... మళ్లీ అదే జరుగుతోంది. కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి కాస్త కూల్‌గా ఉందనుకున్న సమయంలో.. వరల్డ్ వైడ్‌గా మళ్లీ హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. ఏకంగా నాల్గోసారి కూడా ప్రపంచాన్ని గడగడలాడించేందుకు సిద్ధమవుతుంది కరోనా కొత్త వేరియంట్.
ఆ మహమ్మారి, ఇప్పుడు మరోసారి దాడి చేసేందుకు సిద్ధమవుతోందా.? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రపంచం వణికిపోతున్న తీరు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అలర్టులు... ఇవన్నీ చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. మళ్లీ మాస్కయితే మస్ట్ అనిపిస్తోంది. మరీ ముఖ్యంగా కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో ఓ రేంజ్‌లో వణికిస్తోందీ మహమ్మారి. ఒమిక్రాన్ BF-7 వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అంతకంతకూ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ వారంలో ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో 3కోట్ల 70లక్షల మందికి కరోనా సోకినట్టు తెలుస్తోంది.
చైనాలో ఇప్పటి వరకు ఒకే రోజున నమోదైన అత్యధిక కేసుల సంఖ్య 40 లక్షలు. ఇప్పుడు ఏకంగా ఒకే రోజు దాదాపు 4 కోట్ల కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశంలో కూడా ఒకే రోజున ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. చైనాలో విజృంభిస్తున్న కేసుల నేపథ్యంలో ప్రపంచదేశాలు అలెర్ట్ అవుతున్నాయి. ఇటు భారత ప్రభుత్వం సైతం రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్ చేశాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా...ఓ వార్త ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కరోనాకు భయపడి, ప్రజలు ఆక్సిజన్ సిలిండర్లు, మెడిసిన్‌ను కొనేందుకు సిద్ధపడుతున్నారటా.? ఇంతకీ ఈ వార్తలో నిజమెంత..? కరోనా వైరస్ కన్న ఇప్పుడు వ్యాపిస్తున్న వేరియంట్ నిజంగానే డేంజరా..?
ఆక్సిజన్, మందులు కొంటున్న ప్రజలు:
కరోనా మహ్మమారికి బయపడి, ఎక్కడ తమను ఎటాక్ చేస్తుందోనన్న భయంతో ప్రాణాలు వదులుకున్నవాళ్లు చాలానే ఉన్నారు. ఇక కరోనా సోకిన వారికి తగిన స్థాయిలో చికిత్స అందకుండా.. ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు లేక చనిపోయిన వాళ్లు మరికొంత మంది ఉన్నారు. ఈ క్రమంలో కొంతమంది ప్రజలు.. ఈసారి రాబోయే వేరియంట్ కరోనా కన్నా భయంకరమని భావించి, ముందస్తుగానే ఆక్సిజన్ సిలిండర్లు, మెడిసిన్ కొంటున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు నిఫుణులు. సిలిండర్లను ఎప్పుడు ఎలా వాడాలన్న అవగాహన లేకపోతే.. తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి యొక్క పల్స్ రేట్ ఏవిధంగా ఉంది.. మందులతో నయం అవుతుందా..? లేదా..? ఆక్సిజన్ అవసరమా..? ఒకవేళ ఆక్సిజన్ అవసరం ఉంటే.. ఎంతసేపు ఆ వ్యక్తికి ఆక్సిజన్ అవసరం అన్న విషయాలపై కేవలం డాక్టర్లకు మాత్రమే అవగాహన ఉంటుంది. కాబట్టి ముందుగానే ఆక్సిజన్ సిలిండర్లను కొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి లాభం లేదని అంటున్నారు వైద్యనిఫుణులు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతోపాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధంగా ఉన్నాయి. ఒమిక్రాన్ వేవ్ సమయంలోనే వాటి అవసరం రాలేదు. మరీ ముఖ్యంగా భారతీయుల శరీరాల్లో యాంటీబాడీస్ ఉన్నాయి. అయితే ఇంతకు ముందు వచ్చిన కరోనా కంటే.. ఈ బీ17 వేరియంట్ డేంజరన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు వైద్యనిఫుణులు.
ఏంటీ.. కొత్త వేరియంట్.?
అందరి మెదడులో ఇప్పుడు ఇదే ప్రశ్న ఉంది. ప్రస్తుతం చైనాలో బీఏ2.75, బీక్యూ1, ఎక్స్ బీబీ, బీఎఫ్ 7 వ్యాపిస్తున్నాయి. ఇవన్నీ ఒమిక్రాన్ వేరియంట్లేగా ఇప్పటికే నిర్ధారించారు డాక్టర్లు. అయితే ఈ బీఎఫ్-7 ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్నారు. దీనిపై నిపుణుల అధ్యయనం కొనసాగుతోంది. అయితే అత్యంత వేగంగా విజృంభించడం దీని ప్రథమ లక్షణంగా భావిస్తున్నారు. ఈ వేరియంట్ ఇన్‌క్యుబేషన్ పీరియడ్ కూడా చాలా తక్కువని గుర్తించారు. ఈ వేరియంట్ ఏ వ్యాక్సిన్‌ని అయినా తట్టుకొని నిలబడగల శక్తి ఉంది. ఈ కొత్త వేరియంట్ లక్షణాలపై ఇపుడిపుడే కొంత స్పష్టత వస్తోంది. ఈ వేరియట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఒకరికి ఈ వేరియంట్ సోకితే.. వారి నుంచి 10 నుంచి 18 మంది వరకూ విస్తరిస్తుందని అంటోంది WHO. ఈ వేరియంట్ సోకిన వారిలో జ్వరం, దగ్గు, గొంతు గరగర, జలుబు, నీరసం, విపరీతంగా ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయనీ అంటున్నారు వైద్య నిపుణులు. అతి కొద్ది కేసుల్లో మాత్రమే వాంతులు, డయేరియా వంటి పొట్ట సంబంధ వ్యాధులు బయటపడవచ్చని చెబుతున్నారు వైద్యులు.