Rs 2000 Notes: సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2వేల నోట్ల కట్టలు, క్యూ కట్టిన స్థానికులు - తరువాత ఏం జరిగిందంటే !
రాజస్థాన్‌లోని ఓ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు కొట్టుకురావడం స్థానికులను షాక్‌కు గురిచేసింది. పోలీసులు హుటాహుటిన అక్కడకు వెళ్లి వీటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే నకిలీవా, ఒరిజినలా తెలియాల్సి ఉంది.
Currency Notes At Ajmer Lake: సాధారణంగా ఏదైనా చిన్న కరెన్సీ నోటు రోడ్డుమీద కనిపిస్తే వెంటనే తీసేసుకుంటారు. అలాంటిది ఏకంగా రూ.2 వేల నోట్లు కట్టలు కట్టలుగా కొట్టుకువస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. విషయం తెలియగానే స్థానికులు అందరూ భారీ సంఖ్యలో చేరుకుని నోట్ల కట్టల కోసం ఎగబడ్డారు. తరువాత ఏమైందో తెలియాలంటే ఈ వివరాలు చదవండి.
కొందరు నడుచుకుంటూ వెళ్తుండగా రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని ఆనాసాగర్ సరస్సు తీరంలో 2000 రూపాయల నోట్ల కట్టలు గుర్తించారు. ఈ విషయం తెలియగానే నోట్ల కట్టలను సొంతం చేసుకునేందుకు స్థానికులు భారీ సంఖ్యలో సరస్సు వద్దకు చేరుకున్నారు. పాలిథీన్ బ్యాగులో సరసు వద్ద కనిపించిన నోట్ల కోసం జనాలు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అనాసాగర్ వద్దకు చేరుకుని నగదును స్వాధీనం చేసుకున్నారని అనాసాగర్ ఎస్పీ బల్దేవ్ సింగ్ తెలిపారు. 30 నుంచి 32 నోట్ల కట్టలు ఉన్నాయని, అన్నీ రూ.2 వేల నోట్లు కావడంతో పోలీసులు విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. అయితే అవి దొంగ నోట్లా, చెలామణి అయ్యే నోట్లా అనేదానిపై శనివారం స్పష్టత వచ్చింది.
ఆర్బీఐ స్టాంప్ ఉంది కానీ !
నోట్ల కట్టలు సరస్సులో కొట్టుకు వచ్చాయని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి రూ.2 వేల నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నోట్ల విలువ లెక్కించలేదని పోలీసులు చెప్పారు. అయితే ఈ నోట్లు నకిలీ నోట్లు అని, కానీ చూసేందుకు అచ్చం చెలామణీలో ఉన్న 2000 నోట్లలాగ ఉన్నాయని జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. కానీ స్థానికులు మాత్రం అవి నిజమైన కరెన్సీలాగ ఉన్నాయని, వాటిపై రిజర్వ్ బ్యాంక్ స్టాంప్ కూడా ఉందని చెప్పారు. అయితే పాలిథిన్ బ్యాగులో నోట్ల కట్టలుంచి సరస్సు వద్ద ఎందుకు, ఎవరు పారవేసి ఉంటారు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Rajasthan| We received info that bundles of cash with denomination of Rs 2000 were found in Anasagar Lake, Ajmer. Cash recovered but since the notes were way too wet, they haven't been counted; will be done once we dry them off. Probe underway: Baldev Singh, Anasagar PS incharge pic.twitter.com/1GvZI9emFT
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 6, 2022
గత ఏడాది అదే సరస్సులో..
కాగా, గత ఏడాది జూన్‌లో రూ.200, రూ.500 నోట్ల కట్టలు అజ్మీర్‌లోని అనాసాగర్ రామ్‌ప్రసాద్ ఘాట్ వద్ద లభ్యమయ్యాయి. విషయం తెలుసుకుని స్థానికులు అనాసాగర్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని నగదు తీసుకున్నారు. కొందరైతే తమ ప్రాణాలు పోతాయని తెలిసినా, సరస్సులోకి వెళ్లి నోట్లు తెచ్చుకోవడం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు కానీ ఎవరు పారవేశారనే వివరాలు, ఆధారాలు దొరకలేదు.
Also Read: Cyclone Asani: ఏపీ, ఒడిశాలకు తుపాను ముప్పు - ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, మే 10న తీరం దాటే అవకాశం
Also Read: Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్, ఈ స్టిక్కర్లతో ఉన్న వాహనాలకు కొండపైకి నో ఎంట్రీ