News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అప్రూవర్‌గా వైసీపీ ఎంపీ - దూకుడు చూపిస్తున్న ఈడీ !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా అప్రూవర్ గా మారారు. ఇప్పటికే ఆయన కుమారుడు రాఘవరెడ్డి కూడా అప్రూవర్ గా మారి బెయిల్ తెచ్చుకున్నారు.

FOLLOW US: 
Share:

Delhi Liquor Scam :  ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొత్తగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అప్రూవర్ గా మారారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన  పేరు కూడా ఉంది. గతంలో ఆయనకు ఒకటి , రెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణ కు హాజరు కాలేదు. ఆయన కుమారుడు రాఘవనరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఇటీవల ఆయన బెయిల్ పొందారు. ఆ తర్వాత ఆయన అప్రూవర్ పిటిషన్ వేశారు. దానికి కోర్టు అంగీకరించింది. ఇప్పుడు మాగుంట కూడా అప్రూవర్ పిటిషన్ వేయడం  ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకంగా మారింది.                       

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇటీవల ఎమ్మెల్సీ కవితకు ఆడిటర్ గా వ్యవహరించిన బుచ్చిబాబును ప్రశ్నించారు. ఈ క్రమంలో మాగుంట శ్రీనివాసులురెడ్డి చెప్పిన వివరాలతో.. ఈడీ దూకుడు పెంచినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు తరలింపు వ్యవహారంపై ఈడీ కీలక ఆధారాలు సేకరించినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ లో అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత తరపున ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టే వ్యక్తి దగ్గర నుంచి ఇప్పటికే ఈడీ అధికారులు స్టేట్ మెంట్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ లాబీ తరపున అరెస్ట్ అయిన అరబిందో శరత్ చంద్రారెడ్డితో పాటు మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్ గా మారి క్షమాభిక్ష బెయిల్స్ తెచ్చుకున్నారు. ఆడిటర్ బుచ్చిబాబు కూడా అప్రూవర్ అయినట్లుగా తెలుస్తోంది.                        

బాలాజీ గ్రూప్ యజమానిగా ఉన్న వైసీపీ ఎంపీ శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవ ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేస్తుంటారు. గత 70 ఏళ్లుగా లిక్కర్ బిజినెస్ చేస్తున్న మాగుంట కుటుంబం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంది. దేశ వ్యాప్తంగా మాగుంట కుటుంబానికి పలు లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయి.  బాలాజీ గ్రూప్ పేరుతో డిస్టిలరీస్ కాకుండా, ఏంజెల్ షాంపైన్ ఎల్ఎల్పీ, తమిళనాడు డిస్టిలరీ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ఇతర కంపెనీలు మాగుంట కుటుంబానికి సంబంధించిన రెండు కీలక సంస్థలు  లైసెన్స్‌లు పొందినట్లుగా దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.                    

ఈ సంస్థలు లిక్కర్  తయారీ, పంపిణీలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీల ద్వారా మద్యం. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 నియమాలు ఏ కంపెనీకి రెండు జోన్ల కంటే ఎక్కువ కేటాయించకూడదని స్పష్టంగా చేసినా.. పిక్సీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట ఆగ్రో ఫాష్ ప్రైవేట్ లిమిటెడ్లకు జోన్ 32, జోన్లకు జోనల్ రిటైల్ లైసెన్సులు లభించటం  స్కామ్‌లో భాగమని  చెబుతున్నారు. మొత్తంగా ఇటీవలి కాలంలో ఢిల్లీ లిక్కర్ స్కార్  దర్యాప్తు నెమ్మదించింది అనుకున్నారు కానీ.. ఇప్పుడు మళ్లీ దూకుడు చూపిస్తూండటంతో  కేసు ఏ మలుపులు తిరుగుతుందోనని చర్చనీయాంశంగా మారింది. 

Published at : 08 Sep 2023 05:20 PM (IST) Tags: Delhi Liquor Scam YCP MP Magunta Magunta Srinivasula Reddy as Approver

ఇవి కూడా చూడండి

TS DEECET: డీఎడ్ కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం, ఆందోళనలో అభ్యర్థులు

TS DEECET: డీఎడ్ కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం, ఆందోళనలో అభ్యర్థులు

వరంగల్ ‘నిట్’ నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు, ఆర్టీఐ వివరాలతో బయటపడ్డ అవకతవకలు

వరంగల్ ‘నిట్’ నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు, ఆర్టీఐ వివరాలతో బయటపడ్డ అవకతవకలు

PM Modi tour: ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌-వచ్చే వారం మూడు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన

PM Modi tour: ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌-వచ్చే వారం మూడు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన

Breaking News Live Telugu Updates: రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం

Breaking News Live Telugu Updates: రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం

పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన

పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన

టాప్ స్టోరీస్

Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Telangana BJP :  సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Rs 2000 Notes: సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?

Rs 2000 Notes: సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?