News
News
X

Rains In AP Telangana: మరో 4 రోజులపాటు అక్కడ కుండపోత, పిడుగులు పడే ఛాన్స్ - IMD ఎల్లో అలర్ట్

Rains in Telangana AP: ఏపీ, తెలంగాణలో మంగళవారం పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. అక్టోబర్ 1 వరకు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రాలు తెలిపాయి.

FOLLOW US: 
 
Rains in Telangana AP:  నైరుతీ రుతుపవనాల తిరోగమనం ప్రభావంతో సీజన్ చివరిసారిగా భారీగా వర్షాలు కురవనున్నాయి. ఏపీ, తెలంగాణలో మంగళవారం పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. అక్టోబర్ 1 వరకు ఏపీ, తెలంగాణ, యానాంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలో మోస్తరు వర్ష సూచనతో ఎల్లో జారీ చేసింది ఐఎండీ.  వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం, అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. 
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather)
రాష్ట్రంలో మరో 4 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. సెప్టెంబర్ 27 నుంచి ఆగస్టు 1 వరకు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురుస్తాయని అధికారులు ఇదివరకే ప్రకటించారు. భారీ వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరికొన్ని గంటల్లో మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి.

ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. నేడు సైతం హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. నగరంలో నేడు సైతం కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హైదరాబాద్ వాసులకు సూచించారు.

News Reels

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఏపీలో మరో 4 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం సూచన ప్రకారం.. ఈ ప్రాంతాల్లో అక్టోబర్ 1 వరకు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపుతూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో, యానాంలోనూ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. గాలులు వేగంగా వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లడం అంత క్షేమదాయకం కాదని హెచ్చరించారు.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ఈ ప్రాంతాల్లో మరో నాలుగు రోజులపాటు మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్, అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేశాయి. మరో నాలుగు రోజుల వరకు ఈ ప్రాంతాలకు వర్ష సూచనతో ఎల్లో వార్నింగ్ జారీ అయింది. రాయలసీమలోనూ భారీ వర్షాలున్నాయి. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, తిరుపతి జిల్లాలతో పాటు అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలున్నాయి. నీళ్లు నిలిచి ఉంటే చోట జాగ్రత్తగా ఉండాలని, నీటి ప్రవాహాన్ని దాటి వెళ్లే ప్రయత్నాలు చేయకూడదని ప్రజలను అధికారులు హెచ్చరించారు.

Published at : 28 Sep 2022 06:24 AM (IST) Tags: Weather Updates AP Rains Rains In AP Rains In Telangana Telangana Rains

సంబంధిత కథనాలు

Warangal News :  విషాదం మిగిల్చిన బంధువు దశదిన కర్మ, చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

Warangal News : విషాదం మిగిల్చిన బంధువు దశదిన కర్మ, చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

KTR Support : చదువుల సరస్వతికి మంత్రి కేటీఆర్ సాయం, వైద్య విద్యకు ఆర్థిక భరోసా!

KTR Support : చదువుల సరస్వతికి మంత్రి కేటీఆర్ సాయం, వైద్య విద్యకు ఆర్థిక భరోసా!

Komatireddy Comments ; ఏ పార్టీలో చేరాలో ఎన్నికలకు నెల ముందు డిసైడ్ చేసుకుంటా - కాంగ్రెస్‌లో లేనని సంకేతాలిచ్చిన కోమటిరెడ్డి !

Komatireddy Comments ; ఏ పార్టీలో చేరాలో ఎన్నికలకు నెల ముందు డిసైడ్ చేసుకుంటా - కాంగ్రెస్‌లో లేనని సంకేతాలిచ్చిన కోమటిరెడ్డి !

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా :బండి సంజయ్

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా :బండి సంజయ్

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

టాప్ స్టోరీస్

Sajjala On United State ; ఏపీ, తెలంగాణ కలపాలన్నదే వైఎస్ఆర్సీపీ విధానం - సజ్జల సంచలన ప్రకటన !

Sajjala On United State ;  ఏపీ,  తెలంగాణ కలపాలన్నదే వైఎస్ఆర్సీపీ విధానం - సజ్జల సంచలన ప్రకటన !

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

Shivpal Singh Yadav: కలిసిపోయిన బాబాయ్- అబ్బాయ్- ఇక సమాజ్‌వాదీ పార్టీకి బూస్ట్

Shivpal Singh Yadav: కలిసిపోయిన బాబాయ్- అబ్బాయ్- ఇక సమాజ్‌వాదీ పార్టీకి బూస్ట్

Telugu Movies 2022: గూగూల్‌ సెర్చ్‌లోనూ దక్షిణాది సినిమాల హవా, టాప్-10లో ఏయే సినిమాలు ఏయే స్థానాలంటే..

Telugu Movies 2022: గూగూల్‌ సెర్చ్‌లోనూ దక్షిణాది సినిమాల హవా, టాప్-10లో ఏయే సినిమాలు ఏయే స్థానాలంటే..