Weather Latest Update: నేడు కాస్త తగ్గనున్న వర్షాలు, కానీ ఈ ఏరియాల్లో భారీ వర్షాలు - ఐఎండీ అలర్ట్!
సెప్టెంబర్ 7న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
నిన్న వాయువ్య బంగాళాఖాతం పరిసరాళ్ల లోని దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాల్లో ఉన్న అల్పపీడన ప్రాంతం, ఈ రోజు బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నిన్నటి ఆవర్తనం ఈ రోజు దక్షిణ ఇంటీరియర్ ఒడిశా & పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టంకి 7.6 కిమి వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకి వాలి ఉంది. ఈరోజు రాష్ట్రంలో భారీ వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో ( ఉత్తర, తూర్పు ) వచ్చే అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గాలి వేగం గంటకు 30 నుండి 40 కిమీ) కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 7న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 27 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 08 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వాయువ్య దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 90 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరాల వద్ధ గల అల్పపీడన ప్రాంతం ఈరోజు బలహీనపడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏమైనప్పటికి దాని అనుబంధ ఉపరితల అవర్తనం దక్షిణ అంతర్గత ఒడిశా, సరిహద్దు ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుతో నైరుతి వైపు వంగి ఉంటుంది. ఋతుపవన ద్రోణి ఈ రోజు, రాయ్‌పూర్, మాణ్డలా, బికనీర్, కళింగపట్నం అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా వాయువ్య & పరిసర ప్రాంతాలు అనగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 2 .1 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం
ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటరువేగముతో వీయవచ్చు
రేపు (సెప్టెంబరు 6)
తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలో మీటరు వేగముతో వీయవచ్చును.
ఎల్లుండి (సెప్టెంబరు 7)
తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.