Weather Latest Update: నేడు కూడా పిడుగులు, వడగళ్లు - ఈ ప్రాంతాలవారికి అలర్ట్! మళ్లీ కుండపోతనే!
ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే నిన్న పలు చోట్ల భారీ స్థాయిలో వడగండ్ల వాన కురిసిన సంగతి తెలిసిందే.
దక్షిణ కర్ణాటక నుంచి జార్ఖండ్, అంతర్గత కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నేడు తెలంగాణలోనూ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే నిన్న పలు చోట్ల భారీ స్థాయిలో వడగండ్ల వాన కురిసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో వాతావరణ స్థితి
రాయలసీమ, తెలంగాణ, విదర్భ మీదుగా బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ మీదుగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా వరకు ఈ తుపాను విస్తరించి ఉంది. బంగ్లాదేశ్‌ను ఆనుకొని ఏర్పడిన మరో ద్రోణి కూడా బలహీన పడింది. ఈ క్రమంలో అధికారులు మరోసారి ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు. మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, సిరిసిల్ల, ఖమ్మం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆ జిల్లాలతో పాటు సంగారెడ్డి, హైదరాబాద్, మెదక్‌లో వడగళ్లు, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి ఝార్ఖండ్ మీదుగా ఒడిశా వరకు ఒక ద్రోణి, ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకూ మరో ద్రోణి ఆవరించిన ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రం వైపు తేమ గాలులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ వైపు వీటి ప్రభావం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మార్చి 19న ఏలూరు, కృష్టా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. ఆయా జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు పొలాల్లో, చెట్ల కింద ఉండకూడదని సూచించింది.
‘‘విజయవాడ నగరం వైపుగా భారీ వర్షాలు, పిడుగులు విస్తరిస్తున్నాయి. ఇవి చాలా భారీగా, తీవ్రంగా మారి బెజవాడ వైపుగా వస్తున్నాయి. మరో వైపున విశాఖ వైపుగా తెలంగాణ నుంచి భారీ వర్షాలు విస్తరించనున్నాయి. దీని వలన విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు దంచి కొట్టనున్నాయి.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.