News
News
వీడియోలు ఆటలు
X

Weather Latest Update: ఈ జిల్లాల్లో అధికంగా హీట్ వేవ్స్! తెలంగాణలో ఈ ప్రాంతం అంతా నిప్పుల కొలిమే!

21వ తేదీ నుండి 4,5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు, గణనీయంగా తగ్గి  అనేక చోట్ల 40 డిగ్రీల కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

FOLLOW US: 
Share:

నిన్న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి  ఉన్న ద్రోణి/ గాలిలోని అనిచ్చితి , ఈ రోజు  దక్షిణ మధ్య మహారాష్ట్ర నుండి  దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్రం మట్టంకి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు  41 డిగ్రీల నుండి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యన  అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. 

21వ తేదీ నుండి 4,5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు, గణనీయంగా తగ్గి  అనేక చోట్ల 40 డిగ్రీల కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. GHMC పరిధిలో 40 డిగ్రీల కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు, రేపు ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు ( గాలి  గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో) వాయువ్య, ఉత్తర తెలంగాణ జిల్లాలలో వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

ఉత్తర తెలంగాణలో నిప్పుల కొలిమే
నిర్మల్‌, జగిత్యాల జిల్లాల్లో గరిష్ఠంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 11 జిల్లాల్లో 44 డిగ్రీలపైన నమోదయ్యాయి. గ్రామాల్లో ప్రజలు బయటికి రావాలంటే భయపడ్డారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు కొంత ఉపశమనం లభించవచ్చని, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలలోపే నమోదుకు అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భుపాలపల్లి,  ములుగు, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు (30 నుంచి 40 కిలో మీటర్ల వేగం) కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 

హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 38.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.4 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 42 శాతం నమోదైంది. 

ఏపీలో ఎండలు ఇలా
ఏపీలో ఎండలు విపరీతం అయ్యాయి. నేడు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వడగాలులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వెదర్ బులెటిన్ లో తెలిపారు.

‘‘ఏపీలో 21, 22 తేదీల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు కొన్ని చోట్ల వర్షాలు, గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాడగాడ్పులు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీ అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, క్రిష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కాస్త ఎక్కువగా వడగాడ్పులు ఉంటాయని అంచనా వేశారు.

‘‘కర్నూలు నగరం పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇది ఇలా ఉండగా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో వేడి అనేది 40 డిగ్రీలను దాటుతోంది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, ఎన్.టీ.ఆర్., ఏలూరు, కడప​, అన్నమయ్య​, అనంతపురం, నంధ్యాల​, కాకినాడ​, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు 42-44 డిగ్రీలను తాకుతోంది. ఏప్రిల్ నెలలో ఇలా ఉండగా మే నెలలో మాత్రం వేడి ఇకా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్.నినో పసిఫిక్ లో ఏర్పడుతోంది కాబట్టి భారత భూభాగంలో ఉన్న తేమను లాగుతోంది. దీని వలన ఎండలు తీవ్రంగా మారుతున్నాయి. విశాఖ నగరంలో 40.7 డిగ్రీలు నమోదవుతోంది. అలాగే విజయవాడలో 43 డిగ్రీలు నమోదవుతోంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

Published at : 19 Apr 2023 07:14 AM (IST) Tags: Weather Updates Weather in Andhrapradesh Weather in Hyderabad weather in ap telangana Rains In Telangana Heat in hyderabad

సంబంధిత కథనాలు

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

Nizamabad News: న్యూజెర్సీలో నిజామాబాద్ యువకుడు సజీవదహనం, రోడ్డు ప్రమాదమే కారణం!

Nizamabad News: న్యూజెర్సీలో నిజామాబాద్ యువకుడు సజీవదహనం, రోడ్డు ప్రమాదమే కారణం!

Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు

Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు