By: ABP Desam | Updated at : 16 Jul 2023 07:03 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
నిన్న ఉత్తర కోస్తాఆంధ్రప్రదేశ్ మీద 5.8 కిలో మీటర్ల నుండి 7.6 కిలో మీటర్ల ఎత్తు మధ్యలో ఉన్న ఆవర్తనం ఈ రోజు బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలో లోని ఒడిశా - గ్యాంగ్టక్ పశ్చిమ బెంగాల్ తీరాల్లో సగటు సముద్రమట్టం నుండి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు ఒక ఆవర్తనం ఏర్పడి ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుగా వంగి ఉంది.
ఈ ఆవర్తనం రాగల 2 నుండి 3 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉన్న ఉత్తర ఒడిశా, పరిసరాలలోని గ్యాంగ్టక్ పశ్చిమ బెంగాల్ & ఝార్ఖండ్ మీదగా వెళ్లే అవకాశం ఉందని అంచనా వేశారు. మరొక ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతంలో సుమారుగా ఈనెల 18వ తేదీన ఏర్పడే అవకాశం ఉంది.
ఈరోజు దిగివ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ వైపు నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నవి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల వచ్చే అవకాశం ఉంది. ఈరోజు, రేపు భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.7 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 77 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
‘‘నెల్లూరు జిల్లా కోస్తా భాగాల్లో భారీ వర్షం విజృంభిస్తోంది. ముఖ్యంగా ముత్తుకూరు - కృష్ణపట్నం బెల్ట్ లో భారీ వర్షాలు పిడుగులు తీవ్రంగా కనిపిస్తోంది. అలాగే నేడు అర్ధరాత్రి వర్షం ప్రకాశం, తూర్పు పల్నాడు జిల్లా కోస్తా భాగాల్లో ప్రస్తుతం విస్తరిస్తోంది. ఈ వర్షాలే కాకుండా తెలంగాణ నుంచి కూడ కొన్ని భారీ వర్షాలు మన రాష్ట్రంలోనికి విస్తున్నాయి. దీని వలన రానున్న మూడు నుంచి ఐదు గంటల వ్యవధిలో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలను చూడగలం. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కూడా చెదురుముదురుగా మోస్తరు వర్షాలను చూడగలం’’ అని తెలిపారు.
Breaking News Live Telugu Updates: హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు వేసిన లోకేష్- ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు
TS DEECET: డీఎడ్ కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం, ఆందోళనలో అభ్యర్థులు
వరంగల్ ‘నిట్’ నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు, ఆర్టీఐ వివరాలతో బయటపడ్డ అవకతవకలు
PM Modi tour: ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్-వచ్చే వారం మూడు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన
పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
Bigg Boss Gala Event: బిగ్ బాస్ గాలా ఈవెంట్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన ఇంటి సభ్యులు- చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అమర్
Cyber Crime: గణేష్ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్ 15-నమ్మితే అకౌంట్ ఖాళీ అయినట్టే
Rs 2000 Notes: సెప్టెంబర్ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?
/body>