Weather Latest Update: ఏపీలో బెంబేలెత్తిస్తున్న ఎండలు! తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వాన!
ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30 నుండి 40 కి మీ)తో 4, 5 జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
నిన్న తూర్పు విదర్భ నుండి ఉన్న ద్రోణి/ గాలిలోని అనిచ్చితి, ఈ రోజు ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు సగటు సముద్రం మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. దీనివల్ల రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుండి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యన అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. GHMC మరియు చుట్టు పక్కల జిల్లాలలో 40 డిగ్రీల కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది.
ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30 నుండి 40 కి మీ)తో 4, 5 జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 55 శాతం నమోదైంది.
ఏపీలో ఎండలు ఇలా
నేఎండలు విపరీతం అయ్యాయి. ఈమధ్య అత్యధికంగా ప్రకాశం జిల్లా జువ్విగుంటలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఒక ప్రకాశం జిల్లానే కాదు కోస్తాంధ్ర వ్యాప్తంగా, రాయలసీమ జిల్లాలతో పాటుగా తూర్పు తెలంగాణలో వేడి బాగా పెరిగింది. చాలా చోట్లల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. రేపు ఈ వేడి కంటే ఇంకాస్త వేడి ఉండే అవకాశాలున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. గత నెలలో వర్షాలు ఏంటి అని అనుకుంటూ ఉన్నాం, కానీ ఈ నెలలో ఎండలు మామూలుగా లేవు. మరి ఇంకా మంచి ఎండలు ముందు ఉన్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఉత్తరాదిన వాతావరణం ఇలా
ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో ఎండ వేడిమి మొదలైంది. దేశ రాజధానిలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంది, ఇది సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువ. దీంతో మరో రెండు రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని గంగా ప్రాంతాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బీహార్‌లోని కొన్ని ప్రాంతాలలో రాబోయే రెండు రోజుల పాటు వేడిగాలులు ఉండే అవకాశం ఉంది.
అంతకుముందు, ఏప్రిల్ ప్రారంభంలో, వాతావరణ శాఖ వాయువ్య, ద్వీపకల్ప ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఏప్రిల్ నుండి జూన్ వరకు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ఈ కాలంలో, మధ్య, తూర్పు, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వేడి తరంగాలు ఉండే అవకాశం కూడా ఉంది.
18-19 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది
IMD శాస్త్రవేత్త సోమా సేన్ రాయ్ శనివారం (ఏప్రిల్ 15) వార్తా సంస్థ ANI కి మరో వెస్ట్రర్న్ డిస్ట్రబెన్స్ రాబోతోందని, దాని ప్రభావం ఉంటుందని చెప్పారు. మెట్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మైదాన ప్రాంతాల్లో 18-19 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈరోజు ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల ఉంటుంది. వాతావరణం మళ్లీ మారుతుంది. ఇటీవల ఉత్తర కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.