By: ABP Desam | Updated at : 01 Apr 2022 07:24 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఏపీ, తెలంగాణలో ఎండలు మరింత పెరగనున్నట్లుగా అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. అమరావతి వాతావరణ కేంద్రం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా వాతావరణం పొడిగానే ఉంటుంది. మరోవైపు, మత్స్యకారులకు వచ్చే నాలుగు రోజులు ఎలాంటి హెచ్చరికలు లేవని అవరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
మరోవైపు, ఏపీలో 40 డిగ్రీలకు పైగా ఎండలు కాస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి నెలాఖరుకే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ సాధారణం కన్నా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయనగరంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం చెబుతోంది. రాయలసీమ జిల్లాలోనూ అదే పరిస్థితి ఉంది. మధ్యాహ్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తుంది. విజయవాడ, విశాఖలోనూ ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఇప్పటికే 40 డిగ్రీల గరిష్ట ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి.
కోస్తాంధ్ర ప్రాంతంలో కాస్త ఉష్ణోగ్రత తగ్గుదల: ఏపీ వెదర్ మ్యాన్
‘‘బలమైన సముద్రపు గాలుల వల్ల కోస్తాంధ్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టింది. మరో వైపున రాయలసీమ జిల్లాల్లో మాత్రం ప్రస్తుతానికి కూడ 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. ఇవి ఇలాగే మరో రెండు గంటల దాక కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో పక్కన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంది. హైదరాబాద్ లో కూడ 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యింది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
తెలంగాణ వెదర్ అప్‌డేట్స్..
తెలంగాణ రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా ఎండలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఎండలు కాస్తున్న 6 జిల్లాలను వాతావరణ కేంద్రం గుర్తించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలల్లో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఎండ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ ఆరు జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్‌లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని హెచ్చరించింది.
గడిచిన 24 గంటల్లో తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో నమోదు కాగా, అత్యల్ప ఉష్ణోగ్రత కూడా అక్కడే నమోదైంది. అక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రత 42.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.2 డిగ్రీలుగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఏప్రిల్ 4 వరకూ పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని, ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని తెలిపింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) March 31, 2022
Breaking News Live Updates: నేపాల్‌లో విమానం మిస్సింగ్, లోపల 22 మంది ప్రయాణికులు - నలుగురు ఇండియన్స్
AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం
Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !
Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?
Khammam: కానిస్టేబుల్ దంపతుల పాడుపని! ఏకంగా కోటిన్నర దోచేసిన భార్యాభర్తలు
Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !
YSR Rythu Ratham: ఏపీలో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇలా అప్లై చేసుకోండి - లాస్ట్ డేట్ ఎప్పుడంటే
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం