అన్వేషించండి

Weather Latest Update: నేడు కొనసాగనున్న వర్షాలు - ఈ జిల్లాల వారికి అలర్ట్: ఐఎండీ

Weather Forecast: ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల, రేపు కొన్ని చోట్ల, ఎల్లుండి అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.

Weather Latest News: ఆగస్టు 24న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న ఉత్తర పశ్చిమ బెంగాల్, పరిసర ఈశాన్య ఝార్ఖండ్ ప్రాంతాలలో కొనసాగిన అల్పపీడన ప్రాంతం ఈరోజు ఉదయం 0830 IST గంటలకు ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ & దానికి ఆనుకుని ఉన్న వాయువ్య మధ్యప్రదేశ్‌పై ప్రస్పుటమైన అల్పపీడన ప్రాంతంగా మారింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి పైన 7.6 కి.మీ.ల వరకు విస్తరించింది.

తూర్పు-పశ్చిమ ద్రోణి ఒకటి పైన ఏర్పడిన అల్పపీడన ప్రాంతం నుంచి ఆగ్నేయ ఉత్తర ప్రదేశ్ & దానికి ఆనుకుని ఉన్న వాయువ్య మధ్యప్రదేశ్ మీదుగా ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించి ఉంది. 

రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast):

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల, రేపు కొన్ని చోట్ల, ఎల్లుండి అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు (weather warnings)

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం వుంది.

Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 8 - 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 31 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదైంది. 84 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.

ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి, పడమటి గాలులు వీస్తున్నాయి. ఆగస్టు 25న అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు (Andhra Pradesh Weather) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.  భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: మంత్రి పదవులు ఆశించిన వారికి ఇతర పదవులు - రాజగోపాల్ రెడ్డికి అక్కడా నిరాశే !
మంత్రి పదవులు ఆశించిన వారికి ఇతర పదవులు - రాజగోపాల్ రెడ్డికి అక్కడా నిరాశే !
Begging banned in AP:  ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
Telangana Inter Exams: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ఇవిగో పబ్లిక్ ఎగ్జామ్ డేట్స్
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ఇవిగో పబ్లిక్ ఎగ్జామ్ డేట్స్
Mohammed Azharuddin: తెలంగాణ మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్- మైనార్టీ సంక్షేమం లేదా క్రీడా శాఖ కేటాయించే ఛాన్స్!
తెలంగాణ మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్- మైనార్టీ సంక్షేమం లేదా క్రీడా శాఖ కేటాయించే ఛాన్స్!
Advertisement

వీడియోలు

వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు.. అవసరమైన చోట అదరగొట్టేసింది..!
ఏసయ్యే నన్ను నడిపించాడు.. విక్టరీ తర్వాత కన్నీళ్లతో జెమీమా
ఫైటింగ్ సెంచరీతో ఫైనల్ బెర్త్ తెచ్చింది..  పిచ్ మీద పడి చిన్నపిల్లలా ఏడ్చింది
పనికిరాదని పక్కన కూర్చోబెట్టారు.. పోరాడి ఫైనల్‌కి తీసుకెళ్ళింది
వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా.. దశాబ్దాల కలకి అడుగు దూరంలో..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: మంత్రి పదవులు ఆశించిన వారికి ఇతర పదవులు - రాజగోపాల్ రెడ్డికి అక్కడా నిరాశే !
మంత్రి పదవులు ఆశించిన వారికి ఇతర పదవులు - రాజగోపాల్ రెడ్డికి అక్కడా నిరాశే !
Begging banned in AP:  ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
Telangana Inter Exams: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ఇవిగో పబ్లిక్ ఎగ్జామ్ డేట్స్
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ఇవిగో పబ్లిక్ ఎగ్జామ్ డేట్స్
Mohammed Azharuddin: తెలంగాణ మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్- మైనార్టీ సంక్షేమం లేదా క్రీడా శాఖ కేటాయించే ఛాన్స్!
తెలంగాణ మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్- మైనార్టీ సంక్షేమం లేదా క్రీడా శాఖ కేటాయించే ఛాన్స్!
New Rules From November 1:బ్యాంకింగ్ రూల్స్ నుంచి ఆధార్ వరకు నవంబర్ నుంచి వస్తున్న 5 పెద్ద మార్పులు ఇవే!
బ్యాంకింగ్ రూల్స్ నుంచి ఆధార్ వరకు నవంబర్ నుంచి వస్తున్న 5 పెద్ద మార్పులు ఇవే!
Fauzi Actress Imanvi: ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి లేటెస్ట్ స్టిల్స్... చుడిదార్ కట్టినా క్యూట్‌గా ఉంది కదూ!
ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి లేటెస్ట్ స్టిల్స్... చుడిదార్ కట్టినా క్యూట్‌గా ఉంది కదూ!
Chiranjeevi : డీప్ ఫేక్ ఫోటోస్, వీడియోస్ - మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఏంటంటే?
డీప్ ఫేక్ ఫోటోస్, వీడియోస్ - మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఏంటంటే?
Friday Fashion : చలికాలంలో స్టైలిష్‌గా కనిపించాలా? ఈ వింటర్ ఫ్యాషన్ టిప్స్ అబ్బాయిల కోసమే
చలికాలంలో స్టైలిష్‌గా కనిపించాలా? ఈ వింటర్ ఫ్యాషన్ టిప్స్ అబ్బాయిల కోసమే
Embed widget