అన్వేషించండి

Warangal: 21 పీజీలు చేసిన గవర్నమెంట్ టీచర్, 80 ఏళ్ల వయస్సులోనూ మరో పీజీ

Telangana News: ఈ 80 ఏళ్ల వృద్ధుడు 21 ఫీజులు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇన్ని పీజీలు చేయడానికి కారణం ఏంటని అడిగితే తనకు చదువు అంటే మమకారం అని చెప్తున్నారు.

Warangal Teacher News: ఇక్కడ ప్రశాంతంగా చదువుకుంటున్న ఇతని పేరు వీరస్వామి. ఖిలా వరంగల్ ప్రాంతానికి చెందిన వీరస్వామి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవి విరమణ పొందారు. ఏంటి ఈయన ప్రత్యేకత అంటే 80 ఏళ్ల వయస్సులో కూడా విద్యార్థిగా కొనసాగుతూ వివిధ విభాగాల్లో ఇరవైకి పైగా పీజీ లు చేశారు. ఏదో ఒక డిగ్రీ చేసేసి ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ అందులో స్థిరపడి చదువును పక్కన పెట్టడం సహజం. కానీ వీరస్వామి స్కూల్ విద్యను మొదలుపెట్టిన నాటి నుండి నేటి వరకు నిత్య విద్యార్థిగా కొనసాగుతున్నారు. వివిధ యూనివర్సిటీల నుండి 20 పీజీ లు పూర్తి చేశారు. వచ్చే జూలైలో 21 వ పీజీ పూర్తి చేయబోతున్నారు. అయితే భార్య, కుటుంబ సభ్యుల నుండి చదువు మానేయాలని ఒత్తిడి వచ్చినా అవేమీ పట్టించుకోకుండా చదువును కొనసాగిస్తున్నారు. ఎంత పని ఉన్న సాయంత్రం ఏడున్నర గంటల నుండి రాత్రి పదిన్నర వరకు పుస్తకాలతో కుస్తీ పడతాడు.Warangal: 21 పీజీలు చేసిన గవర్నమెంట్ టీచర్, 80 ఏళ్ల వయస్సులోనూ మరో పీజీ

25 పీజీలు లక్ష్యం
వీరాస్వామి 5 సంవత్సరాల బాలుడిగా పాఠశాల విద్యార్థిగా చదువును మొదలుపెట్టి 80 సంవత్సరాల వృద్ధుడుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా కొనసాగుతున్నారు. 1962 లో పదవ తరగతి పూర్తి చేసి హెచ్ ఎస్ ఈ లో చేరాడు. హెచ్ ఎస్ ఈ పూర్తి చేసిన తరువాత 1968 లో ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిందని చదువు ఆపకుండా 1973 డిగ్రీ పూర్తి చేసి పీజీ లు చేయడం మొదలు పెట్టాడు. అలా పీజీ లు చేస్తూనే ఉన్నాడు. వీరాస్వామి బీ ఎడ్ చేస్తున్న క్రమంలో మూడు పీజీ లు చేసిన లెక్చరర్ ను ఆదర్శంగా తీసుకొని తాను కూడా పీజీలు చేస్తున్నానని వీరాస్వామి చెప్పారు. తనకు చదువు మీద బోర్ కొట్టలేదని చదువుపై మక్కువతో చదువుతున్నానని తెలిపారు. 25 పీజీ లు చేసి ఆపేస్తానని చెప్పారు.

Warangal: 21 పీజీలు చేసిన గవర్నమెంట్ టీచర్, 80 ఏళ్ల వయస్సులోనూ మరో పీజీ

వీరాస్వామి నిత్య విద్యార్థితో పాటు కళాకారుడు కూడా. 1974 లో స్టేజి ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి 1980 నుండి బుర్రకథ కళాకారుడిగా ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ లో ప్రదర్శనలు ఇస్తున్నారు. వీరాస్వామి యోగా, ఎయిడ్స్, పల్స్ పోలియో, నిరక్షరాస్యత వివిధ అంశాలపై దూరదర్శన్ లో ప్రదర్శనలు చేశాడు. ఇప్పటి రేడియో, టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరాస్వామిని చదువును ఆపేయాలని ఎన్నిసార్లు చెప్పినా వినలేదని చదువుతూనే ఉంటానని వీరస్వామి భార్య కొమురమ్మ చెప్పారు. 

Warangal: 21 పీజీలు చేసిన గవర్నమెంట్ టీచర్, 80 ఏళ్ల వయస్సులోనూ మరో పీజీ

వీరాస్వామి ప్రైవేట్ స్కూల్ ను సైతం నడుపుతున్నాడు. తన తండ్రి 21 పీజీలు చేయడం గర్వకారణంగా ఉందని, ఈ రోజు వరకు యూనివర్సిటీలకు, పరీక్షలకు వెళ్లిన ఈరోజు కుమారుల సహాయం తీసుకోలేదని ఒక్కడే వెళ్ళిచేవాడని కుమారుడు సాగర్ చెప్పారు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు వీరస్వామి గురించి గొప్పగా చెప్పారు. పాఠశాలలో పనిచేసే డ్రైవర్లు, అటెండర్లను డిగ్రీలను, ఉపాధ్యాయులను పీజీలు చేయించాడని ఉపాధ్యాయుడు రాజు చెప్పారు. చదువు విజ్ఞానాన్ని పెంచుతుందని ఇప్పటి యువతకు తాను ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నానని వీరస్వామి చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Bima Sakhi: 'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్కేజ్రీవాల్ ఇంటి వీడియో షేర్ చేసిన బీజేపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Bima Sakhi: 'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
Manchu Mohan Babu Family Issue : ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
Manchu Mohan Babu Family Issue: మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
Home Minister on CIBMS: స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
Pushpa 2: 'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
Embed widget