వరంగల్ నగరంలో నూతన సీపీ అకస్మిక తనిఖీలు, పోలీసులకు కీలక సూచనలు
Warangal CP, AV Ranganath: వాహన తనిఖీలు చేస్తున్న తీరుపై తెలుసుకోనేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వరంగల్ నగరంలో అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
Warangal CP, AV Ranganath: వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏ.వి. రంగనాథ్ బాధ్యత చేపట్టారు. వరంగల్ నగరంలో నూతన సీపీ రంగనాథ్ అకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలో ప్రతిరోజూ సాయంత్రం 5గంటల నుంచి వాహన తనిఖీలు నిర్వహించాల్సిందిగా పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ అదేశాలు జారీచేశారు. దీనితో నగరంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న తీరుపై తెలుసుకోనేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ వరంగల్ నగరంలో అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ మామూనూర్ పోలీస్ స్టేషన్తో పాటు వరంగల్ రైల్వే స్టేషన్, తెలంగాణ జంక్షన్లతో పాటు పోలీస్ అధికారులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న తీరును పోలీస్ కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
చోరీ వాహనాలపై స్పెషల్ ఫోకస్
తనిఖీల్లో సంబంధిత పోలీస్ అధికారులు ఎన్ని వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఏవిధంగా వాహన తనిఖీలు చేపట్టారు దాని పోలీస్ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ అడిగితెలుసుకోవడంతో పాటు, వారు నిర్వహించిన తనిఖీలను పోలీస్ కమిషనర్ ట్యాబ్లో వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులతో మాట్లాడుతూ నగరంలో చోరీ గురైన వాహనాలను గుర్తించడం కోసం వాహన తనిఖీలు నిర్వహించాలని, ఇకపై వాహన తనిఖీలు ప్రధాన రోడ్డు మార్గాల్లో కాకుండా, ఇతర మార్గాల్లో కూడా తనిఖీలు నిర్వహించాలని, ఈ తనిఖీల ద్వారా ప్రజల్లో పోలీసులపై ప్రజలకు నమ్మకం కలగడంతో పాటు నేరాలను నియంత్రించగలుగుతామని పోలీస్ కమిషనర్ తెలిపారు.
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం.. వరంగల్ లో వినూత్న కార్యక్రమాలు
వరంగల్ జిల్లాలో డిసెంబర్-9 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ మరో వినూత్న కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టింది. అవినీతికి దూరంగా ఉంటూ అత్యంత నిజాయితీగా వ్యవహరిస్తున్న ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారులను సన్మానించడంతో పాటు అశ్వంపై ఊరేగించారు. ఈ కార్యక్రమం హనుమకొండ వెయ్యి స్తంభాల గుడి వద్ద ప్రారంభమై అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ గా సాగింది. జ్వాలా, లోక్ సత్తా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించిన వారికి ‘జ్వాల’ అనే అవినీతి వ్యతిరేక సంస్థ పెద్దఎత్తున గుర్రాలపై ఊరేగించి ఘనంగా సన్మానించి, నగదు బహుమతులను అందించారు.
గతంలో ‘లోక్‌సత్తా’ తెలుగు రాష్ట్రాలలో బలంగా వున్న రోజులలో ప్రతినిత్యం ఆ సంస్థ కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలపై నిఘా వేసేవారు. అవినీతి అధికారుల చిట్టాను ప్రజలకు బహిర్గతం చేసేవారు. ప్రస్తుతం లోక్‌సత్తా, సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక, యాంటీ ఫర్ కరప్షన్, జ్వాల వంటి మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు అవినీతికి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించి విద్యార్థులు, యువత, ప్రజలలో అవగాహన పెంచుతున్నాయి. ఏసీబీ అధికారుల సెల్ నెంబర్లను, ఇతర సమాచారాన్ని గ్రామాల్లో సైతం కరపత్రాల రూపంలో ఇస్తున్నారు. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064పై విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. అవినీతికి కళ్ళెం వేసేందుకు నూతన విభాగాలు, వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు.