By: ABP Desam | Updated at : 21 Mar 2023 01:05 PM (IST)
దూలం మంజుల, నల్లబెల్లి తహసీల్దార్
‘‘భూమి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నాం, రిజిస్ట్రేషన్ చేయండి. లేదంటే నీపై పెట్రోల్ పోసి చంపుతాం’’ అని పోలీసుల సాక్షిగా కొందరు తహసీల్దార్‌ను బెదిరించారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం (మార్చి 20) జరిగింది. బాధిత తహసీల్దార్ దూలం మంజుల తెలిపిన వివరాల ప్రకారం.. నల్లబెల్లి మండలంలోని బిల్ నాయక్ తండాకు గుగులోతు పద్మ అనే మహిళ భూమి రిజిస్ట్రేషన్ చేయాలని స్లాట్ బుక్ చేసుకుంది. ఈ భూమిపై బ్యాంకు లోన్ తీసుకున్నట్లు గుర్తించారు. అంతే కాకుండా పేపర్లు సక్రమంగా లేకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరిస్తూ బ్యాంక్ నుంచి నోడ్యూస్ సర్ఠిఫికెట్ తీసుకురావాలని తహసీల్దారు కార్యాలయ సిబ్బంది సూచించారు.
ఈ విషయాన్ని పద్మ వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో బిల్ నాయక్ తండాకు చెందిన కొందరు వ్యక్తులు సోమవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించి ‘స్లాట్ బుక్ చేసుకున్నాం రిజిస్ట్రేషన్ చేయండి. నోడ్యూస్ ఎందుకు తీసుకురావాలి’ అంటూ నిలదీశారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కార్యాలయానికి చేరుకోగా, రిజిస్ట్రేషన్ చేయకపోతే నీపై పెట్రోల్ పోసి చంపేస్తామని వారి ముందే తహసీల్దార్‌ను నానా దుర్భాషలాడారని తహసీల్దార్ ఆరోపించారు. నల్లబెల్లి నుంచి నువ్వు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని, లేకుంటే నిన్ను చంపి జైలుకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని భయభ్రాంతులకు గురిచేసినట్లు తహసీల్దార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు.
Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!
Group1: గ్రూప్-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
Nagar Kurnool: నాగర్ కర్నూల్‌లో సీఎం కేసీఆర్ టూర్ - కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ ప్రారంభం
Telangana: కులవృత్తులు, చేతి వృత్తుల వారికి రూ.1లక్ష ఆర్థిక సాయం, దరఖాస్తులు ప్రారంభం
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!