Warangal News: నర్సంపేట మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం వాయిదా - కౌన్సిలర్ల డుమ్మానే కారణం
Warangal News: నర్సంపేట మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశానికి 11 మంది డుమ్మా కొట్టడంతో.. సమావేశం వాయిదా పడింది. మున్సిపల్ ఛైర్ పర్సన్ తీరుకు నిరసనగానే కాంగ్రెస్ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు.
Warangal News: వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశానికి 11 మంది కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఒంటెద్దు పోకడ వల్లే చాలా కోపంగా ఉన్న కౌన్సిలర్లు.. సమావేశానికి రాలేరు. ఈక్రమంలోనే సమావేశం వాయిదా పడింది. అలాగే ఛైర్ పర్సన్ పై అవిశ్వాసం పెట్టాలని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నర్సంపేట మున్సిపాలిటీలో నిధుల కేటాయింపులో ఛైర్ పర్సన్ వివక్ష చూపుతున్నారు. కమిషనర్ల తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మున్సిపాలిటీ సమావేశాన్ని బహిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలపై.. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. చైర్ పర్సన్, కమిషనర్లపై కలెక్టర్, అదనపు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్ చేస్తున్నారు.