By: ABP Desam | Updated at : 31 May 2023 08:01 PM (IST)
Edited By: jyothi
ఫాథర్ కొలంబో కల ఇప్పటికి నెరవేరింది: మంత్రి హరీష్ రావు ( Image Source : Errabelli Dayakar Rao Facebook )
Father Colombo Medical College: హన్మకొండలో నిర్మించిన ఫాదర్ కొలంబో వైద్య కళాశాలను మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, అరూరి రమేష్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఫాదర్ కొలంబో కల నేడు నెరవేరిందని అన్నారు. ఉద్యమ సమయంలో నుండి తాను దీని గురించి వింటున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కుల, మతాలకు తేడా లేకుండా అందరికీ సమ అవకాశాలు ఇస్తుందన్నారు. 60 ఏళ్లలో 3 ప్రభుత్వ కాలేజీలు ఉంటే, 9 ఏళ్లలో 21కి చేర్చామన్నారు. అలాగే నాడు ప్రభుత్వ , ప్రైవేటులో మొత్తం 20 మెడికల్ కాలేజీలు ఉంటే నేడు 55కు చేరాయని చెప్పారు. ఎంబీబీఎస్ సీట్లు నాడు 2950 మాత్రమే ఉండగా.. నేడు 8340 సీట్లకు చేరిందని వివరించారు. వరంగల్ మూడు మెడికల్ కాలేజీలు ఉండే నగరం అయ్యిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రావడం, సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లే ఇదంతా సాధ్యమైందని అన్నారు. మెడికల్ కాలేజీ అంటే 500 పడకల ఆసుపత్రి వస్తుందని.. దీంతో ఇక్కడి వారికి ఉపాధి వస్తుందని స్పష్టం చేశారు. దీనివల్ల ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు.
Telangana government hospitals created history in country with the highest number of deliveries in government hospital.
— Harish Rao Thanneeru (@BRSHarish) May 31, 2023
>80% deliveries in govt hospitals in Sangareddy, Narayanpet, Medak and Jogulamba Gadwal
In 16 districts, 70% of deliveries are registered in government… pic.twitter.com/ksveJIaVFz
భూపాలపల్లి, జనగాంలో మెడికల్ కాలేజీలు వచ్చాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. అలాగే ములుగులో మెడికల్ కాలేజీ వస్తుందన్నారు. ఉత్తర తెలంగాణకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 1100 కోట్ల రూపాయలతో హెల్త్ సిటీ నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ ఆసుపత్రి ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మీకు పూర్తి మద్దతుగా ఉందని. సీఎం కోసం మీరంతా ప్రార్థన చేస్తూ.. అండగా ఉండాలని సూచించారు. మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ... పాత మిషన్ ఆసుపత్రిని మించి కొలంబో ఆసుపత్రి పని చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. కొలంబో ఆస్పత్రి వాళ్లు ప్రజలకు ఉచితంగా, మంచి వైద్యం ఇస్తారని నమ్మకం తోనే ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వచ్చారని చెప్పారు.
సమైక్య రాష్ట్రంలో 75 ఏండ్లలో 3 వైద్య కళాశాలలు ఏర్పాటైతే.. తెలంగాణ ఏర్పాటు తర్వాత 7 ఏండ్లలో ఏకంగా 33 వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తున్న ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానిది.
— Telangana Digital Media Wing (@DigitalMediaTS) May 30, 2023
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా, తెలంగాణలో జిల్లాకు ఒకటి చొప్పున 33 ప్రభుత్వ వైద్య కళాశాలలు.@BRSHarish pic.twitter.com/XJCsRZ1uL7
Cyber Security Course: సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, దరఖాస్తుకు వీరు అర్హులు
KNRUOH: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సులు - వివరాలు ఇలా
Breaking News Live Telugu Updates: కొవిడ్ వ్యాక్సిన్ కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలకు వైద్య శాస్త్రంలో నోబెల్
Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో మరో అడుగు- రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈసీ అధికారుల పర్యటన
ప్రధాని టూర్‌కి తెలంగాణ సీనియర్లు దూరం- తమ దారి తాము చూసుకుంటారా ?
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !
Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!
/body>