News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Congress Workers Fight: వరంగల్ కాంగ్రెస్‌లో వర్గపోరు, అంగీలు చింపుకుని, చెప్పులతో కొట్టుకున్న కార్యకర్తలు

Congress Workers Fight: వరంగల్ కాంగ్రెస్ లో విభేదాలు బయటపడ్డాయి. ఎర్రబెల్లి స్వర్ణ, కొండా మురళి-సురేఖ వర్గీయుల ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

FOLLOW US: 
Share:

Congress Workers Fight: కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆ పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అంగీలు చింపుకుని, చెప్పులతో కొట్టుకున్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు కొట్లాటకు దిగారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని అబ్నస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ గొడవ జరిగింది.

కులం పేరుతో దూషించడంతో గొడవ!

బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో  రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. ఓ నేతను వేదికపైకి పిలిచే సమయంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు గొడవకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వేదికపైకి వెళ్లే సమయంలో ఓ నేతను కులం పేరుతో ప్రత్యర్థి వర్గానికి చెందిన మరొకరు దూషించడంతో గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల మధ్య వ్యక్తిగత విభేదాల కారణంగానే గొడవ జరిగినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

సహకరించాలని కోరిన స్వర్ణ, ఒప్పుకున్న కొండా!

వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవిని కొండా మురళి- సురేఖ దంపతులు తమ వర్గానికి చెందిన వారికే కట్టబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే పార్టీ నాయకత్వం మాత్రం ఎర్రబెల్లి స్వర్ణను ఎంపిక చేసి అధ్యక్ష బాధ్యతలు ఆమెకు అప్పగించింది. ఈ విషయంపై తమకు సహకరించాలని కొండా మురళీ- సురేఖ దంపతులను ఎర్రబెల్లి స్వర్ణ దంపతులు కలిసి కోరినట్లు స్వర్ణ వర్గీయులు చెబుతున్న మాట. ఇందుకు కొండా దంపతులు కూడా అంగీకరించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆ వర్గం నాయకులు చెబుతున్నారు. దీంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 

కొండా వర్గీయుల ఆందోళనతోనే గొడవ!

వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ఎర్రబెల్లి స్వర్ణ.. కొండా దంపతుల ఇంటికి వెళ్లి కలవలేదని, ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పిలవలేదని కొండా వర్గీయులు ఆందోళనకు దిగినట్లు మరో వర్గం వారు చెబుతున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని అది కాస్త గొడవకు దారి తీసిందని వెల్లడిస్తున్నారు. 

ఒక్కొక్కరి అంతు చూస్తానని ఎర్రబెల్లి రాజేశ్వరరావు వార్నింగ్!

ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారోత్సవంలో కావాలనే కొందరు గొడవకు దిగినట్లు మరోవర్గం వారు ఆరోపిస్తున్నారు. ఇష్టారీతిగా కొట్టారని చెబుతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం కాస్త రసాభాసగా మారడంతో ఎర్రబెల్లి స్వర్ణ భర్త రాజేశ్వరరావు ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. గొడవకు దిగిన కార్యకర్తల అంతు చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. వరంగల్ అధ్యక్షురాలు, పీసీసీ సభ్యులు సాక్షిగా కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకోవడం, చొక్కాలు చింపుకుని, చెప్పులతో కొట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Published at : 31 May 2023 02:20 PM (IST) Tags: CONGRESS Warangal News Workers Attack Each Other Warangal Cong Workers Clash Fight

ఇవి కూడా చూడండి

Singareni Employees: సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్, 11వ వేజ్ బోర్డు ఏరియర్స్ విడుదల

Singareni Employees: సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్, 11వ వేజ్ బోర్డు ఏరియర్స్ విడుదల

JNV: నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!

JNV: నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!

TSRTC Dasara Offer: దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ - 10 శాతం రాయితీ

TSRTC Dasara Offer: దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ - 10 శాతం రాయితీ

JNV: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!

JNV: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!

Breaking News Live Telugu Updates: పుంగనూరు, అంగళ్లు కేసుల్లో టీడీపీ నేతలకు బెయిల్

Breaking News Live Telugu Updates: పుంగనూరు, అంగళ్లు కేసుల్లో టీడీపీ నేతలకు బెయిల్

టాప్ స్టోరీస్

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?