అన్వేషించండి

Warangal News: వరంగల్ వాసులు గాల్లో ఎగరగలరా? ఎయిర్ పోర్టు కోసం దశాబ్దాలుగా ఎదురుచూపులు!

Warangla News: ఒకప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా వెలుగొందిన వరంగల్ ఎయిర్ పోర్టు ప్రస్తుతం శిథిలస్థితికి చేరింది. ఎయిర్ పోర్టుకు ఈ బడ్జెట్ లోనూ కేంద్రం నిధులు కేటాయించలేదు

Airport in Warangal: విమానాశ్రయాల విషయంలో తెలంగాణ వెనకబడి ఉందన్నది వాస్తవం. హైదరాబాద్ (Hyderabad) మినహా రాష్ట్రంలో మరెక్కడా ఎయిర్ పోర్టు లేదు. రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్కటే విమానాశ్రయం దశాబ్దాలుగా ఉంది. రాష్ట్రం దాటి బయటకు ఎక్కడికి వెళ్లాలన్నా హైదరాబాద్‌పై ఆధారపడాల్సిందే. రాష్ట్రంలోనే రెండో పెద్ద నగరమైన వరంగల్‌ (Warangal)లో స్వాతంత్య్రానికి పూర్వమే విమానాశ్రయం ఉంది. స్వల్ప మరమ్మతులు చేస్తే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా.. దశాబ్దాల కాలంగా తెలంగాణ (Telangana) ప్రజలకు ఎదురు చూపులు తప్పడం లేదు

భారతదేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం

వరంగల్ నగరంలోని మామునూరు వద్ద చివరి నిజా మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1930లోనే అతిపెద్ద విమానాశ్రయం (Airport) నిర్మించారు. దాదాపు 700 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 6 కిలోమీటర్ల అతిపెద్ద రన్‌వే తో భారత్‌లోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఉత్తర తెలంగాణలోని వివిధ వ్యాపారాల అభివృద్ధికి రాకపోకల కోసం ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకునే వారు. అనేకమంది రాష్ట్రపతులు, ప్రధానులు, ఇటీవల కాలంలో హోంమంత్రి అమిత్‌షా సైతం ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకున్నారు. ప్రముఖుల పర్యటనల రాకపోకలతో 1980 వరకు విమానాశ్రయం అందుబాటులో ఉంది. కానీ ఆ తర్వాత పూర్తిగా మూపడింది.

యుద్ధకాలంలోనూ సేవలు

భారత్, చైనా యుద్ధ సమయంలో శత్రువులు ఢిల్లీ (Delhi) విమానాశ్రయాన్ని టార్గెట్ చేసుకోడంతో.. ప్రత్నామ్నయంగా రాకపోకల కోసం వరంగల్ విమానాశ్రయాన్ని వినియోగించుకున్నారు. కార్గిల్ యుద్ధ సమయంలోనూ శత్రువులు ఏదైనా విమానాశ్రయాన్ని టార్గెట్ చేస్తే అత్యవసరంగా వాడుకునేందుకు వరంగల్ ఎయిర్ పోర్టును సిద్ధం చేసి ఉంచారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ విమానాశ్రయం మాత్రం సామాన్య ప్రజల రాకపోకలకు మాత్రం ఉపయోగపడకపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని చెప్పాలి.

6.6 కి.మీ రన్ వే, పైలట్, సిబ్బంది గృహాలు, పైలట్ శిక్షణా కేంద్రం, ఒకటి కన్నా ఎక్కువ టెర్మినల్స్ తో 700 ఎకరాలకు పైగా భూమి కలిగిన ఉన్న ఈ విమానాశ్రయం ప్రస్తుతానికి నిరూపయోగంగా పడి ఉంది.

ప్రతిపాదనలకే పరిమితం

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఎయిర్ పోర్ట్అథారిటీ ఆఫ్ ఇండియా టెక్నికల్ సర్వే నిర్వహించిన తర్వాత మూడు విమానాశ్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. అందులో ఈ వరంగల్ విమానాశ్రం ఒకటి. అయితే దశాబ్దాలుగా నిరూపయోగంగా ఉండటంతో విమానాశ్రయానికి చెందిన కొంత భూమి కబ్జాకు గురైంది. ఈ విమానాశ్రయాన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలంటే మరికొంత భూమి అవసరం ఉంది. భూసేకరణకు ప్రభుత్వం సైతం ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో కేంద్రంపై కొంత ఒత్తిడి తీసుకురాగా వరంగల్ (Warangal) ఎయిర్ పోర్టు ప్రారంభించాలని నిర్ణయించింది. ముందుగా తక్కువ సీటింగ్ ఉన్న చిన్న విమానాలను నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. కానీ ఇప్పటికీ ఆ హామీ అమలుకు నోచుకోలేదు.

ఎదురు చూపులు తప్పడం లేదు

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారీ వరంగల్ విమానాశ్రయానికి నిధుల కేటాయింపు జరుగుతుందని ఎదురు చూడటం.. నిరాశ చెందడం పరిపాటిగా మారింది. తమ ప్రాంతం నుంచే విమానాల్లో ఎగరాలనుకుంటున్న వరంగల్‌ వాసుల కల కలగానే మిగిలిపోతోంది. ఈసారి బడ్జెట్‌లోనూ ప్రభుత్వం మొండి చేయి చూపింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
NEET UG Revised Results: నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
లోక్‌సభలో గందరగోళం, నీట్‌పై చర్చకు ప్రతిపక్షాల పట్టు - సమావేశాలు మొదలైన కాసేపటికే అలజడి
లోక్‌సభలో గందరగోళం, నీట్‌పై చర్చకు ప్రతిపక్షాల పట్టు - సమావేశాలు మొదలైన కాసేపటికే అలజడి
Andhra Pradesh : ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం- ఒకే కుటుంబంలో భర్త, భార్య, కుమార్తెకు పింఛన్ ఇచ్చిన చంద్రబాబు
ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం- ఒకే కుటుంబంలో భర్త, భార్య, కుమార్తెకు పింఛన్ ఇచ్చిన చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
NEET UG Revised Results: నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
లోక్‌సభలో గందరగోళం, నీట్‌పై చర్చకు ప్రతిపక్షాల పట్టు - సమావేశాలు మొదలైన కాసేపటికే అలజడి
లోక్‌సభలో గందరగోళం, నీట్‌పై చర్చకు ప్రతిపక్షాల పట్టు - సమావేశాలు మొదలైన కాసేపటికే అలజడి
Andhra Pradesh : ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం- ఒకే కుటుంబంలో భర్త, భార్య, కుమార్తెకు పింఛన్ ఇచ్చిన చంద్రబాబు
ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం- ఒకే కుటుంబంలో భర్త, భార్య, కుమార్తెకు పింఛన్ ఇచ్చిన చంద్రబాబు
Telangana : తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణంలో మరో వెసులుబాటు- ఈసారి ఆ టెన్షన్ లేకుండా చర్యలు
తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణంలో మరో వెసులుబాటు- ఈసారి ఆ టెన్షన్ లేకుండా చర్యలు
Jay Shah: తదుపరి కోచ్‌పై జై షా కీలక వ్యాఖ్యలు,  ఛాంపియన్స్‌ ట్రోఫీకి సీనియర్లు
తదుపరి కోచ్‌పై జై షా కీలక వ్యాఖ్యలు, ఛాంపియన్స్‌ ట్రోఫీకి సీనియర్లు
New Criminal Laws: అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు, తొలి కేసు నమోదు చేసిన పోలీసులు
అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు, తొలి కేసు నమోదు చేసిన పోలీసులు
Free Bus Scheme In Andhra Pradesh: ఏపీ మహిళలకు గుడ్‌ న్యూస్‌-  ఉచిత ఆర్టీసీ బస్‌ ప్రయాణంపై అప్‌డేట్ ఇచ్చిన రవాణా శాఖ మంత్రి
ఏపీ మహిళలకు గుడ్‌ న్యూస్‌- ఉచిత ఆర్టీసీ బస్‌ ప్రయాణంపై అప్‌డేట్ ఇచ్చిన రవాణా శాఖ మంత్రి
Embed widget