అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

KU Vice Chancellor: కేయూ వీసీ ప్రొ. రమేష్‌పై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం

Kakatiya University News: కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ అక్రమాలు చేశారన్న ఆరోపణలతో విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.

KU Vice Chancellor Prof Tatikonda Ramesh | వరంగల్: గత మూడేళ్లలో కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్. తాటికొండ రమేష్‌ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యునివర్సిటీ టీచర్ల సంఘం జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శికి రెండు సార్లు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం శనివారం (మే 18న) నాడు ఆదేశాలు జారీ చేశారు.

వర్సిటీ టీచింగ్ స్టాఫ్ సంఘం జనరల్ సెక్రటరీ డా మామిడాల ఇస్తారి మాట్లాడుతూ గత మూడేళ్లలో వీసీ ప్రొ. తాటికొండ రమేష్ టీచర్లు, విద్యార్థుల వ్యతిరేక విధానాలను అనుసరించారని ఆరోపించారు. ఆయన పలు అక్రమాలకు పాల్పడ్డారని, గతంలో కేయూ పాలక మండలికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.

అక్రమంగా అడ్జంట్ ఫ్యాకల్టీ నియామకాలు
యూజీసీ నిబంధనలకు తుంగలో తొక్కి, ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరిస్తూ, యూనివర్సిటీ చట్టానికి వ్యతిరేకంగా 16 మంది రిటైర్ ఫ్యాకల్టీలను అడ్జంట్  ఫ్యాకల్టీగా నియమించారు కేయూ వీసీ రమేష్. వారికి నెలకు రూ 8 లక్షలు ఇస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని మామిడాల ఇస్తారి ఆరోపించారు.

భూ ఆక్రమణ దారులతో పాలన సాగించిన వీసీ
కేయూ ఏఆర్ గా పనిచేస్తూ అక్రమంగా కేయూ సర్వే నెంబర్ 229 ను 235 గా మార్చుకొని ఇండ్లు కట్టుకున్న పెండ్లి అశోక్ బాబును ల్యాండ్ కమిటీ తొలగించారు. కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంతో ఫిర్యాదు చేయవలసి వచ్చిందన్నారు. అటువంటి వారిని ప్రోత్సహిస్తూ చేసిన వీసీ పాలనపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

వీసీ సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ అక్రమం
రిటైర్ అయ్యే ఒక రోజు ముందు అర్థరాత్రి దొంగ చాటుగా వీసీ రమేష్, అప్పటి రిజిస్ట్రార్ శ్రీనివాస్ అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ తీసుకున్నారని మామిడాల ఇస్తారి వెల్లడించారు. ఆ ఇద్దరు వారి ప్రమోషన్ కొరకు వారే నోటిఫికేషన్ ఇచ్చుకొని పాలక మండలి సమావేశంలో పాలక మండలి చైర్మన్, సెక్రెటరీ లేకుండానే నిర్వహించి అక్రమ ప్రమోషన్లకు పాల్పడ్డారని ఆరోపించారు. వీసీ ప్రొఫెసర్ ప్రమోషన్ కు సంబంధించిన ప్రొసీడింగ్స్‌కు పూర్తి పాలక మండలి ఆమోదం లేదని ప్రొఫెసర్ ప్రమోషన్ కూడా చెల్లదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అర్హత లేకున్నా వీసీగా నియామకం
వీసీ నియామకానికి 10 సంవత్సరాల ప్రొఫెసర్ అనుభవం తప్పనిసరి అని యూజీసీ నిబంధనలు చెప్తున్నా గత ప్రభుత్వం వీసీ రమేష్ కు 10 సంవత్సరాల ప్రొఫెసర్ అనుభవం లేకున్నా వీసీగా నియమించారని తెలిపారు. అర్హత లేని వీసీ పాలన వలన టీచర్లు, విద్యార్థులు, నాన్ టీచింగ్ ఉద్యోగులు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. వ్యక్తిగత కక్షలకు పాల్పడుతూ అక్రమంగా బదిలీలు, పాలన పదవులు, అక్రమ డిప్యూటేషన్లు చేశారని చెప్పారు.

ప్రైవేట్ కేసుకు లక్షల ప్రభుత్వ ధనం దుర్వినియోగం
వీసీ తన అనర్హత కేసును వాధించడానికి సంబంధం లేని అడ్వకేట్ కు రూపాయలు ఐదు లక్షలు చెల్లించారని ఆరోపించారు. వర్సిటీ తరుఫున వాదించడానికి స్టాండింగ్ కౌన్సిల్ వుండగా అదనంగా మరో అడ్వకేట్ తో వకాలత్ వేయించి, వకాలత్ వేయని అడ్వకేట్ కు ఐదు లక్షలు చెల్లించిన విషయంపై ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల రోజులుగా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ అక్రమంగా తనకు ఇష్టం వచ్చినట్లు బదిలీలు, పాలన పదవులు నిర్వహిస్తూ పక్షపాత వైఖరి ప్రదర్శించారని తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Weather Update: బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Embed widget