Konda Surekha: మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్ - కారణం ఇదే
Telangana News: కేటీఆర్‌పై కొండా సురేఖ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై కేటీఆర్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపైనే తాజాగా ఎన్నికల సంఘం స్పందించింది.
![Konda Surekha: మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్ - కారణం ఇదే Telangana Election commission warns Minister Konda Surekha due to election violation Konda Surekha: మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్ - కారణం ఇదే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/26/430097a58ea0e07f76377264268bb7bf1714147785892234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Election Commission warning to Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యల కారణంగా ఈసీ.. కొండా సురేఖకు హెచ్చరిక ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉన్నందున కొండా సురేఖతో పాటు అభ్యర్థులు అంతా జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాలని ఈసీ నిర్దేశించింది. ఎన్నికల వేళ స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రిగా ఉన్న కొండా సురేఖ మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఈసీ హితవు పలికింది.
మాజీ మంత్రి కేటీఆర్‌పై కొండా సురేఖ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై కేటీఆర్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపైనే తాజాగా ఎన్నికల సంఘం స్పందించింది. ఈ నెల 1న వరంగల్ లో కొండా సురేఖ ఓ ప్రెస్ మీట్ పెట్టి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌తో ఎంతో మంది హీరోయిన్లను కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేశారని కొండా సురేఖ ఆరోపించారు. ఎంతో మంది అధికారులను బలి చేశారని కొండా సరేఖ ఆరోపించారు. వారు ఉద్యోగాలు కోల్పోయి జైలుకు వెళ్లేలా చేశారని విమర్శించారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లారని ఎద్దేవా చేశారు. కొండా సురేఖ మాట్లాడిన ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్‌పై కొండా సురేఖ వ్యాఖ్యల మీద కర్నె ప్రభాకర్, దాసోజు శ్రవణ్ వంటి బీఆర్ఎస్ నేతలు అందరు కలిసి ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)