News
News
X

Errabelli Dayakar Rao: ఈ 27న స్టేషన్‌ ఘన్‌పూర్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటన - ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

చిల్పూరు, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లోని కరువు పీడిత గ్రామాలకు సాగునీరు అందించేందుకు రూ.133 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

FOLLOW US: 
Share:

వరంగల్‌ : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నెల 27న స్టేషన్ ఘన్ పూర్ లోని వేలేరులో పర్యటించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. చిల్పూరు, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లోని కరువు పీడిత గ్రామాలకు సాగునీరు అందించేందుకు రూ.133 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లపై ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్ష నిర్వహించారు. 

కేసీఆర్ భగీరథ ప్రయత్నం, కేటీఆర్ చొరవ
తీవ్ర కరువుతో ఇబ్బందులు పడుతున్న స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చేసిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వేలేరు, చిల్పూరు, ధర్మసాగర్ మండలాల రైతులకు సాగునీరు అందించే ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్‌ భగీరథ ప్రయత్నం చేశారు, మంత్రి కేటీఆర్‌ చొరవ తీసుకోవడంతో నిధులు మంజూరు అయ్యాయన్నారు. ఇప్పుడు ప్రాజెక్టు శంకుస్థాపన చేసేందుకు మంత్రి కేటీఆర్‌ రానుండటం స్థానికులకు సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని వేలేరులో కేటీఆర్ పర్యటన విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సయన్వయంతో పని చేయాలని సూచించారు.

ఇంఛార్జీలను నియమించిన మంత్రులు
ఆయా విభాగాల వారీగా ఇంఛార్జిలను మంత్రి ఎర్రబెల్లి నియమించారు. మండలాలకు ఇంఛార్జీలుగా జాఫర్‌గఢ్‌, మార్నెని రవీందర్‌రావు, లింగాల ఘనపురానికి ఆర్‌ అండ్‌బీ సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, స్టేషన్‌ ఘన్‌పూర్‌కు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ధర్మ సాగర్‌కు కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, రఘునాథపల్లికి రుణ విమోచన కార్పొరేషన్ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, వెలేరుకు దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, భీమదేవరపల్లికి హనుమకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, చిల్పూర్‌కు జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డిలను నియమించారు. ఓవరాల్ గా సమన్వయకర్తలుగా ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య వ్యవహరిస్తారు. మంత్రి కేటీఆర్‌ పర్యటన విజయవంతం కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే టీ రాజయ్య, కుడా చైర్మన్ సుందర్‌ రాజ్ యాదవ్, జడ్పీ చైర్మన్లు సుధీర్ కుమార్, సంపత్ రెడ్డి పాల్గొన్నారు.

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఏకైక పార్టీ బీఆర్‌ఎస్‌ మాత్రమేనని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామానికి చెందిన పార్టీ క్రియాశీల కార్యకర్త చిన్నాల రమేశ్ కొద్ది నెలల కిందట ప్రమాదవశాత్తు చనిపోగా, ఆయన భార్య మౌనికకు బీఆర్ఎస్ తరుఫున మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కును తిరుమలగిరిలో మంత్రి ఎర్రబెల్లి బుధవారం అందజేశారు.

దేశంలో 60 లక్షల మంది కార్యకర్తలున్న పార్టీ తమ పార్టీ అన్నారు. బీఆర్ఎస్ కు వెన్నముక లాంటి కార్యకర్తలకు సీఎం కేసీఆర్, మంత్రులు, నేతలు అండగా ఉంటున్నామని చెప్పారు. దురదృష్టవాశాత్తు కార్యకర్త మరణిస్తే వారి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ ఆసరాగా ఉంటూ పార్టీ తరఫున వారికి బీమాను అందిస్తామని వెల్లడించారు. కనుక ప్రజా సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పనిచేసే పార్టీకి కార్యకర్తలు అండగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. 

Published at : 22 Feb 2023 10:03 PM (IST) Tags: KTR Errabelli Dayakar Rao BRS Telangana Station Ghanpur

సంబంధిత కథనాలు

Medical Seats: కొత్తగా పది మెడికల్‌ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!

Medical Seats: కొత్తగా పది మెడికల్‌ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!

తెలంగాణలో పగలు ఎండలు మండే- సాయంత్రం పిడుగులు పడే

తెలంగాణలో పగలు ఎండలు మండే- సాయంత్రం పిడుగులు పడే

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం, పెన్‌డ్రైవ్‌లో మొత్తం 15 ప్రశ్నపత్రాలు!

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం, పెన్‌డ్రైవ్‌లో  మొత్తం 15 ప్రశ్నపత్రాలు!

TS EAMCET: టీఎస్ఎంసెట్‌ - 2023 షెడ్యూల్‌లో మార్పులు, కొత్త తేదీలివే!

TS EAMCET: టీఎస్ఎంసెట్‌ - 2023 షెడ్యూల్‌లో మార్పులు, కొత్త తేదీలివే!

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌-  నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి