బైబై కేసీఆర్ అంటున్న రేవంత్- సరికొత్త నినాదంతో శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం
హాత్‌సే హాత్ పేరుతో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో కొనసాగుతోంది.
2019 ఎన్నికల్లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా నినాదాలు ఇచ్చింది. అలాంటి నినాదాల్లో బై బై బాబు అనేది ప్రజల్లోకి చొచ్చుకెళ్లిపోయింది. జగన్, షర్మిల సహా వైసీపీ లీడర్లు ఎక్కడ పర్యటించినా ఈ నినాదాన్నే ప్రస్తావించేవారు.
బైబై బాబు అప్పట్లో ట్రెండ్ అయింది. అప్పుడు ఉన్న టిక్‌టాక్ ఇతర షార్ట్స్‌లో బైబై బాబు బ్యాక్‌గ్రౌండ్‌తో చాలా రీల్సే వచ్చాయి. అందుకే దాన్ని కాస్త మార్చి ఇప్పుడు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అందుకున్నారు.
బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. తాను ముసలివాడినైపోయానంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. దాన్నే రేవంత్ పట్టుకున్నారు. ఆయనకు వయసు అయిపోయిందేన తమ కార్యకర్తలంతా బై బై కేసీఆర్ అంటున్నారని కామెంట్ చేశారు.
హాత్‌సే హాత్ పేరుతో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో కొనసాగుతోంది. కొత్త కొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి బైబై కేసీఆర్ నినాదాన్ని కార్యకర్తలు చెప్పారు. ఈ పర్యటనలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోపాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు.
#ByeByeKCR pic.twitter.com/W69EkdgnCA
— Revanth Reddy (@revanth_anumula) March 2, 2023
వయసుపైబడిన కేసీఆర్ చేతకాక ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. అందుకే కొంతకాలంగా జరిగే సభల్లో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ బీఆర్‌ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ నాయకులే కేసీఆర్‌కు చేత కాదని కృష్ణా రామా అంటూ ఫామ్‌హౌస్‌లో శేష జీవితం గడపాలని కోరుకుంటున్నారని విమర్శించారు.
సవాల్ చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భయపడిపోయారన్నారు రేవంత్. అందుకే భూపాలపల్లిలో 144 సెక్షన్ పెట్టించారన్నారు. ఆయన కుట్రలు, అక్రమాలు, భూకబ్జా, అక్రమ ఇసుక తవ్వకాలు లాంటివి బయటపడతాయో అని కుట్రపూరిత చర్యలకు దిగారన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పాలనలోకి వస్తే ప్రతి పేదవాడికి ఇల్లు, 2 లక్షల ఉద్యోగాలు మంజూరు చేస్తామన్నారు.
తెలంగాణ ఉద్యమం అంటే విద్యార్థుల ఉద్యమం అని, కేవలం రాజకీయ నాయకుల వల్లే రాష్ట్రం ఏర్పడలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా సమాజం కోసం పోరాడారని, మలి తెలంగాణ ఉద్యమం విద్యార్థుల వల్లే ఉవ్వెత్తున ఎగసిందన్నారు. విద్యార్థుల త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందని, ఆడపిల్లల హాస్టళ్లలో మౌళిక వసతులు లేవని ఆడపడుచుల గోడు వినిపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రాకపోవడం వల్ల సర్టిఫికెట్లు తీసుకునేటపుడు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తమకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలని మరో ఆడబిడ్డ చెప్పింది. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఆడబిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ అందరితో మాట్లాడాక రాష్ట్రంలో పాలనను తెలంగాణ సీఎం కేసీఆర్ గలికొదిలేసారని అర్థమైంది. కేసీఆర్ తెలంగాణ మోడల్ అంటే.. మినిమం గవర్నెన్స్ మాగ్జిమం పాలిటిక్స్ అని అర్థమైందని ఎద్దేవా చేశారు.
దేశం ఆకలి తీర్చేందుకు హరిత విప్లవం తీసుకొచ్చింది కాంగ్రెస్. ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్. బీడీఎల్, బీహెచ్ఈఎల్, రైల్వే, ఎయిర్ ఇండియా లాంటి సంస్థలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో మినహాయింపు పొందిన పరిశ్రమల్లో కూడా రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని కాంగ్రెస్ ఆలోచిస్తోందన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి చేసిన సంస్థలను ప్రధాని మోదీ ప్రైవేట్ కు అప్పగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.