News
News
X

Preethi Final Rights: డాక్టర్ ప్రీతి అంత్యక్రియలు పూర్తి, గుండెపగిలే వేదనతో అంతిమ వీడ్కోలు

జనగామ జిల్లా మొండ్రాయి మండలం గిరిని తండాలో ప్రీతి మృతదేహాన్ని ఖననం చేశారు. ఆ సమయంలో ప్రీతి తండ్రితల్లిదండ్రులు, గ్రామస్థుల వేదన వర్ణనాతీతంగా ఉంది.

FOLLOW US: 
Share:

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి అంత్యక్రియలు ముగిశాయి. ఆమె సొంత ఊరు అయిన జనగామ జిల్లా మొండ్రాయి మండలం గిరిని తండాలో ఆమె మృతదేహాన్ని ఖననం చేశారు. ఆ సమయంలో ప్రీతి తల్లిదండ్రులు, గ్రామస్థుల వేదన వర్ణనాతీతంగా ఉంది. గుండెపగిలే వారు రోదించిన తీరు చూస్తున్న వారికి హృదయవిదారకంగా అనిపించింది. ఒక సీనియర్ బాసిజం వల్ల ప్రీతి అన్యాయంగా ప్రాణాలు తీసుకోవడాన్ని గ్రామస్థులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.

అంతకుముందు ఆమె ఇంటి నుంచి అంత్యక్రియలు జరిగే వారి వ్యవసాయ క్షేత్రం వరకూ ప్రీతి మృతదేహానికి ట్రాక్టర్ పైన అంతిమయాత్ర తరహాలో తీసుకొచ్చారు. స్వస్థలంలోనే ఆమెను గొయ్యి తీసి పూడ్చి పెట్టారు. అంతకుముందు ప్రీతి పాడెను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ మోశారు.

అంత్యక్రియలకు వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. బీజేపీకి చెందిన మాజీ ఎంపీ రవీందర్ నాయక్, కాంగ్రెస్ నేత జంగా రాఘవ రెడ్డి, స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు, జీసీసీ ఛైర్మన్ గాంధీ, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థి సంఘాలు, ఆ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రీతికి కన్నీటి వీడ్కోలు పలికారు.

ప్రీతి మరణంపై సమగ్ర విచారణ చేయించాలని విద్యార్థి సంఘాల నేతలు  డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ప్రీతి అంత్యక్రియల సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ప్రీతి తండ్రి ఆరోపణలు

ప్రీతి మరణం పట్ల ఆమె తండ్రి తీవ్రమైన ఆవేదన చెందారు. తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని, తండ్రి నరేందర్‌ ఆరోపించారు. ప్రీతి తనకు తానుగా ఇంజక్షన్ చేసుకోలేదని, ఎవరో ఇంజక్షన్‌ ఇచ్చారని అన్నారు. సైఫ్ అనే వ్యక్తే ప్రీతికి ఇంజక్షన్ ఇచ్చి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో పోలీసులు విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు.  ప్రీతి మృతి చెందడానికి గల కారణాలను పోలీసులు విచారణలో కనుగొనాలని పిలుపునిచ్చారు. కాకతీయ మెడికల్‌ కాలేజీ అనస్థీషియా డిపార్డ్ మెంట్ హెచ్‌వోడీని సస్పెండ్‌ చేయాలని, ఆ తర్వాత ఈ వ్యవహారంలో సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేస్తేనే ప్రీతి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు, నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పారు.

ఆదివారం రాత్రి (ఫిబ్రవరి 26) ప్రీతి చనిపోగా, నిమ్స్ ఆస్పత్రి నుంచి ఆమె శరీరాన్ని తరలించేటప్పుడు కూడా ఆమె తండ్రి నరేంద్ర కొన్ని డిమాండ్స్ చేశారు. మెడికల్ కాలేజీలో అనస్థీషియా డిపార్ట్ మెంట్ హెచ్‌వోడీని సస్పెండ్‌ చేసిన తర్వాతే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎలా చనిపోయిందో తెలిపే సమగ్ర రిపోర్టు కావాలని నరేందర్‌ కోరారు. మరణానికి కారణాలు చెబితేనే మృతదేహాన్ని తీసుకుంటామని, లేకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని తేల్చి చెప్పారు. 

మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. కుటుంబ సభ్యులు, గిరిజన, విద్యార్థి సంఘాలు అడ్డగించాయి. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారులు ఏఆర్‌సీ వార్డు ముందు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఐసీయూ గ్లాస్‌ డోర్‌ను కూడా బద్దలుకొట్టారు. కొందరు మహిళలు అంబులెన్స్‌కి అడ్డుపడటంతో పాటు తాళం లాక్కున్నారు.

దీంతో పోలీసులు వారిని వాహనాల్లోకి ఎక్కించి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని ఎందుకు బయటికి తీసుకొస్తున్నారంటూ ప్రీతి తల్లి ఆగ్రహం వ్యక్తం చేయడంతో మళ్లీ ఐసీయూకు తరలించారు. ప్రీతి మృతదేహాన్ని ప్యాక్‌ చేసి పంపుతామని ఓ వైద్యుడు అనడంతో బంధువులు, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అర్ధరాత్రికల్లా పోస్టుమార్టం పూర్తి చేసి ఉదయానికి స్వస్థలానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు.

Published at : 27 Feb 2023 01:25 PM (IST) Tags: janagama news Warangal Medical student Doctor Preethi Kakatiya Medical college Preethi final rights

సంబంధిత కథనాలు

Medical Seats: కొత్తగా పది మెడికల్‌ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!

Medical Seats: కొత్తగా పది మెడికల్‌ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం, పెన్‌డ్రైవ్‌లో మొత్తం 15 ప్రశ్నపత్రాలు!

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం, పెన్‌డ్రైవ్‌లో  మొత్తం 15 ప్రశ్నపత్రాలు!

TS EAMCET: టీఎస్ఎంసెట్‌ - 2023 షెడ్యూల్‌లో మార్పులు, కొత్త తేదీలివే!

TS EAMCET: టీఎస్ఎంసెట్‌ - 2023 షెడ్యూల్‌లో మార్పులు, కొత్త తేదీలివే!

Heart Attack : మహబూబాబాద్ జిల్లాలో విషాదం, గుండెపోటుతో 13 ఏళ్ల చిన్నారి మృతి

Heart Attack : మహబూబాబాద్ జిల్లాలో విషాదం, గుండెపోటుతో 13 ఏళ్ల చిన్నారి మృతి

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్