News
News
X

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

KCR Warangal Tour: వరంగల్‌లో నిర్మించిన ప్రతిమ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌, క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రిని 350 పడకల సామర్థ్యంతో నిర్మించారు.

FOLLOW US: 

KCR Inaugurates Prathima Cancer Hospital: వరంగల్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. శనివారం ఉదయం రోడ్డు మార్గంలో కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్ చేరుకున్నారు. వరంగల్‌లో (ములుగు రోడ్డులో) నిర్మించిన ప్రతిమ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌, క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రిని 350 పడకల సామర్థ్యంతో నిర్మించారు. ఈ మెడికల్ కాలేజీ ద్వారా మెడికల్ స్టూడెంట్స్ కు ప్రతి ఏడాది 150 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.

అప్రమత్తంగా ఉండకపోతే అంతే సంగతులు..
వరంగల్ లో ప్రతిమ మెడికల్ కాలేజీ, క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. విద్వేష రాజకీయాలు వద్దని, యువత అన్ని విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. గతంలో అప్రమత్తంగా లేకపోవడంతో సొంత రాష్ట్రంలో పరాయి వాళ్లగా ఉండిపోయామని గుర్తుచేశారు. ఈ దేశం సహనశీలత దేశమని, పోరాటాలకు వెనుకాడని దేశం భారత్ అని కొనియాడారు. కొందరు దుర్మార్గులు వారి స్వార్థ, దుర్బుద్ధి రాజకీయాలతో విధ్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

పలు రంగాల్లో తెలంగాణ అగ్రస్థానం..
పరిశుభ్రత, తలసరి ఆదాయం సహా పలు రంగాల్లో చూస్తే తెలంగాణ ముందంజలో ఉంది. ఆరోగ్య రంగంలో అద్భుతాలు చేసేందుకు మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నాం. గతంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైంది. గతంలో 5 కాలేజీలుంటే, ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు అయ్యాయి. మనం 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి జిల్లాకు ఓ మెడికల్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. త్వరలోనే మిగతా కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం.  2014కు ముందు రాష్ట్రంలో ప్రైవేట్, గవర్నమెంట్ కలిపి కేవలం 2800 మెడికల్ సీట్లు ఉండేవి. ఈరోజు వాటి సంఖ్య 6,500కు చేరిందన్నారు. అన్ని మెడికల్ కాలేజీలు పూర్తయితే మెడికల్ సీట్ల సంఖ్య 10 వేలు దాటుతాయన్నారు సీఎం కేసీఆర్. 

రష్యా, ఉక్రెయిన్ అవసరం లేదు..
ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయి, అన్ని జిల్లాల్లో కాలేజీలు అందుబాటులోకి వస్తే తెలంగాణ విద్యార్థులు మెడిసిన్ చదివేందుకు రష్యా, ఉక్రెయిన్ లకు వెళ్లే అవసరం లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు చెబుతున్నారని గుర్తుచేశారు కేసీఆర్. బీసీలకు సీట్లు 2000కు పైగా వస్తాయన్నారు. దేశానికే ఆదర్శంగా మనం నిలవాలని, ఏ దేశమైనా చుట్టూ సంభవించే పరిణామాలను గమనించి అప్రమత్తంగా ఉంటేనే పురోగమిస్తాం అన్నారు. దీనికి ఉదాహరణ తెలంగాణ రాష్ట్రమే. ఓనాడు మనం అప్రమత్తంగా లేకపోతే వేరే రాష్ట్రంలో కలిసి, నిర్లక్ష్యానికి గురయ్యాం. అందుకు దశాబ్దాల పాటు పోరాటం చేయాల్సి వచ్చింది. 2001లో తాను మరోసారి ఉద్యమించి, పోరాటం చేస్తే రాష్ట్రం సాధించుకున్నామని గుర్తుచేశారు.

News Reels

రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు వచ్చి తిట్టిపోతున్నారు, కానీ అవన్నీ ఉట్టి మాటలేనన్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఢిల్లీలో తెలంగాణకు ఎన్నో అవార్డులు వస్తున్నాయి. హైదరాబాద్ ను మించి వరంగల్ లో 2000 పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దుతామన్నారు. 24 అంతస్తుల్లో వరంగల్ లో మెడికల్ ఆసుపత్రి, కాలేజీ నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ వాళ్లు సైతం వరంగల్ కు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకునేలా పరిస్థితులు మారతాయన్నారు. సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షాలు తెలుపుతూ జై తెలంగాణ, జై భారత్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు సీఎం కేసీఆర్.

Published at : 01 Oct 2022 01:01 PM (IST) Tags: CM KCR Convoy KCR Warangal Woman Constable Prathima Cancer Hospital KCR Warangal Tour

సంబంధిత కథనాలు

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

FRO శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత - త్వరలోనే ఇంటి స్థలం, ఉద్యోగం

FRO శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత - త్వరలోనే ఇంటి స్థలం, ఉద్యోగం

YS Sharmila Padayatra : వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత, ప్రచార రథానికి నిప్పుపెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు!

YS Sharmila Padayatra : వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత, ప్రచార రథానికి నిప్పుపెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు!

 TS News Developments Today: బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అవుతుందా? ఇవాల్టి తెలంగాణ టాప్‌ న్యూస్ డెవలప్‌మెంట్స్ ఇవే

 TS News Developments Today: బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అవుతుందా? ఇవాల్టి తెలంగాణ టాప్‌ న్యూస్ డెవలప్‌మెంట్స్ ఇవే

Petrol-Diesel Price, 28 November 2022: ఈ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుముఖం- మిగతా చోట్లో స్థిరంగా ధరలు

Petrol-Diesel Price, 28 November 2022: ఈ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుముఖం- మిగతా చోట్లో స్థిరంగా ధరలు

టాప్ స్టోరీస్

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?