సీఎం కేసిఆర్ పర్యటనలో అపశృతి జరిగింది. కాన్వాయ్ నుండి జారి పడ్డ మహిళా కానిస్టేబుల్ సీఎం కేసీఆర్ జనగామ నుంచి వరంగల్ వెళ్తుండగా.. కాన్వాయ్ నుంచి ఓ మహిళా కానిస్టేబుల్ జారిపడ్డారు కొంచెం దూరం వెల్లగానే అందులో ఉన్నవారు అలర్ట్ చేయడంతో వాహనం ఆగింది. తోటి పోలీసులు వచ్చి మహిళా కానిస్టేబుల్ కు సహాయం చేసే ప్రయత్నం చేయగా, మహిళా కానిస్టేబుల్ స్వయంగా లేచి వెళ్లి మళ్లీ కాన్వాయ్ ఎక్కారు. వరంగల్ కు బయలుదేరుతుంటే సీఎం కాన్వాయ్ నుంచి కానిస్టేబుల్ జారీ పడింది. ఆమెకు స్వల్పగాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్ జనగామ జిల్లా, పెంబర్తి కళాతోరణం చేరుకున్నారు. ఇక్కడ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, స్థానిక నేతలు సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. శనివారం వరంగల్ లో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు ముందుగానే అప్రమత్తం అయ్యారు. కాన్వాయ్ లోని మరో వాహనంలో ఎక్కిన మహిళ కానిస్టేబుల్ సీఎం కేసిఆర్ పర్యటనలో అపశృతి జరిగింది. కాన్వాయ్ నుండి జారి పడ్డ మహిళా కానిస్టేబుల్