తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు

ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది.

దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయి

హైదరాబాద్ ను మేఘాలు కమ్మేసినా, మధ్యాహ్నానికి ఉక్కపోత అధికం కానుంది

వాయువ్య దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీచనున్నాయి

విజయనగరం జిల్లా రాజం వైపు నుంచి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

అనకాపల్లి, పార్వతీపురం మణ్యం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి

నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, గుంటూరు, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ఎన్.టీ.ఆర్ జిల్లాల్లో వానలున్నాయి

అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో చాలా తక్కువ చోట్ల వర్షాలు