తెలుగు రాష్ట్రాలకు ఈ వారం భారీ వర్ష సూచన ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు నేటి (సెప్టెంబర్ 19) నుంచి మరో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయి ఉమ్మడి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి రాయలసీమలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఈ ప్రాంతంలో చాలా తక్కువ వర్షాలుంటాయి. నేడు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి అల్పపీడనం ప్రభావంతో ఈ 20 నుంచి తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి వాయువ్య మరియు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.