అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.

దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఆగ్నేయ మధ్యప్రదేశ్, విదర్భలపై నెలకొన్న అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి తీవ్ర అల్పపీడనంగా మారింది.

ఏపీ, తెలంగాణ, యానాంలలో మరో రెండు రోజులు మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు

ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి

పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు సైతం భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ

పల్నాడు, ఎన్.టీ.ఆర్, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా చిరుజల్లులు

కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదు కానుంది

వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.