తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవడం దాదాపుగా తగ్గిపోయింది. అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు ఉపరితల ఆవర్తనం తమిళనాడు దాని పరసర ప్రాంతాలలో సముద్ర మట్టంపై 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది ఏపీ, తెలంగాణ, యానాంలో నేడు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి జిల్లాల్లో తేలికపాటి జల్లులు ఆగస్టు 5 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్ నగరంలో ఉదయం మేఘాలతో ఉన్నా, మధ్యాహ్నానికి వేడి గాలులు వీచనున్నాయి. ఉక్కపోత అధికం కానుంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో తక్కువగా ఉంది ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కృష్ణా, గుంటూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వాతావరణం వేడెక్కుతోంది వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ