బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాలపై ప్రభావం తగ్గింది.

వాయుగుండం ఆగ్నేయ మధ్యప్రదేశ్ వైపు కదులుతూ వాయువ్య మధ్యప్రదేశ్ కు చేరుకుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

ఏపీ, యానాంలలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనుండగా.. తెలంగాణలలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్ష సూచన ఉంది

నేడు సైతం హైదరాబాద్ ను మేఘాలు కమ్మేస్తాయి. నగరంలో కొన్ని చోట్ల చిరు జల్లులు పడే ఛాన్స్ ఉంది

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు తగ్గినా.. కొన్నిచోట్ల నేడు సైతం వర్షాలు కురుస్తాయి.

తూర్పు గోదావరి, యానాం, పశ్చిమ గోదావరిలలో ఆకాశం మేఘావృతమై ఉండనుంది.

తిరుపతి నగరంలో, చిత్తూరు జిల్లాలో వర్షాలు, నెల్లూరుతో పాటు అక్కడ నుంచి కొనసీమ జిల్లాలోకి విస్తరిస్తున్నాయి

దక్షిణ కోస్తాంధ్రలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, క్రిష్ణా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్షాలుంటాయి.