బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఏపీ, తెలంగాణపై తగ్గింది. అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్ వైపు కదులుతూ చివరికి వాయువ్య మధ్యప్రదేశ్ కు చేరుకుంది నిన్న ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో వర్షం పడింది నేడు ఉత్తర తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్ ను మేఘాలు కమ్మేస్తాయి. నగరంలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మరో రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయి. విశాఖ నగరంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్.టీ.ఆర్, కృష్ణా అక్కడక్కడా చిరుజల్లులు పడతాయి రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదు కానుంది.