ఏపీ, తెలంగాణలో నేడు సైతం పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి

ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది.

వీటి ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్ష సూచనతో ఎల్లో జారీ చేసింది ఐఎండీ.

నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు

హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్

అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నేడు వర్షాలున్నాయి

తాడేపల్లిగూడం - తణుకు పరిధిలో, విశాఖ నగరం పశ్చిమ భాగాలు గోపాలపట్నం, సింహాచలం, పెందుర్తిలలో వర్షాలు

గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చాలా తక్కువ చోట్ల వర్షాలు కురువనున్నాయి.

కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో చాలా తక్కువ చోట్ల వర్షాలు

వాయువ్య దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీచనున్నాయి.