Ganesh Chaturthi 2024: స్పెషల్ అట్రాక్షన్‌గా వరంగల్ ఆర్మీ జవాన్ గణపతి, సమాజానికి గొప్ప సందేశం!
Vinayaka Chavithi 2024 | దేశ వ్యాప్తంగా బొజ్జ గణపయ్యలు పలు రూపాలు, ఆకృతులలో కనువిందు చేస్తున్నారు. కానీ వరంగల్ లో ఆర్మీ జవాన్ గణపతి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటోంది. మంచి సందేశం ఇచ్చారని కొనియాడారు.
Warangal Army Ganesh idol | వరంగల్: గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని తొమ్మిది రోజులపాటు గణనాథునికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం సర్వసాధారణం. కానీ హనుమకొండ నగరంలోని నూతన గజాణ మండలి సమాజానికి మెసేజ్ ఇచ్చే విధంగా బార్డర్ లో ఎముకలు కోరికే చలిలో విధులు నిర్వహించే జవాన్లను గౌరవిస్తూ వినాయకున్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు.
జవాన్ విధులు... కుటుంబం బాధను తెలియజేస్తూ
దేశ రక్షణ కోసం విధుల్లో చేరిన జవాన్ సెలవులకు ఇంటికి వచ్చి తిరిగి సరిహద్దులకు వెళ్తున్న క్రమంలో కవాన్ కుటుంబం బాధను ఈ మండపంలో వివరించారు. జవాన్ విధులకు వెళ్తుంటే ఆ జవాన్ కుమారుడు వెళ్లొద్దు నాన్న అని వెళ్లకుండా కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు. ఇక కూతురు ఊహ తెలియని వయస్సు కావడంతో బాయ్ చెబుతుంది. భార్య కుటుంబాన్ని వదిలి తిరిగి విధులకు వెళ్తుండడంతో కన్నీటి పర్యంతమవుతుంది.
మరో పక్కన కుటుంబానికి దూరంగా దేశ రక్షణ కోసం బార్డర్ లో విధులు నిర్వహించే సైనికుని విధులను ప్రతిబింబించారు. చివరగా దేశ సరిహద్దుల్లో మంచుకొండల్లో ఎముకలు కోరికే చలిలో ఓ చేత గన్, మరో చేత జాతీయ జెండాను పట్టుకొని విధులు నిర్వహించే గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అత్యంత భక్తి శ్రద్ధలతో గణనాధునికి పూజలు చేయడంతో పాటు దేశ రక్షణ కోసం తన కుటుంబానికి దూరంగా ఉంటూ ఎలా విధులు నిర్వహిస్తారో జవాన్ ను గౌరవిస్తూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు రాకేష్ చెప్పారు.
జవాన్ ను గౌరవిస్తూ...
అయితే దేశ రక్షణ కోసం నిర్వహిస్తున్న జవాన్ గౌరవించే విధంగా జవాన్ కష్టాలను తెలియజేస్తూ తమకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో చెప్పారు. కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న ఓ జవాన్ రోజు ఏటీఎం నుండి 100 రూపాయలు విత్ డ్రా చేస్తున్నారు ఆ సమయంలో మరో జవాన్ ఒకేసారి డబ్బులు తీసుకోవచ్చు కదా అని అడిగినప్పుడు నేను రోజు వంద రూపాయలు తీయడం వలన నా కుటుంబానికి మెసేజ్ వెళుతుంది. మెసేజ్ వెళ్తే బ్రతికినట్టు లేదంటే చనిపోయినట్టు అని ఒక ఆర్టికల్ చదివి ఆ స్పూర్తితో జవాన్ గణపతిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. నగరంలో ఎక్కడ లేని విధంగా సుధా నగరంలో సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఇక్కడ గణనాధుని ఏర్పాటు చేయడం జరుగుతుందని భక్తులు తమ అభిప్రాయాలను చెప్పారు.
ఐదు సంవత్సరాలుగా... భక్తితో సమాజానికి మెసేజ్
అయితే ఈ నూతన గజాన మండలి గత ఐదు సంవత్సరాలుగా సమాజాన్ని మేల్కొల్పే విధంగా గణపతి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. కరోనా సమయంలో కరోనా గణపతి. తర్వాత రైతు గొప్పతనాన్ని చెప్పే విధంగా రైతు గణపతి, హెల్మెట్ ధరించి వాహనం నడపకపోతే జరిగే పరిణామాలు తెలియజేస్తూ హెల్మెట్ గణపతి, ఈసారి ఆర్మీ జవాన్ గణపతిని ఏర్పాటు చేశారు.
Also Read: వానలు ఆగాలని చిలుకూరు బాలాజీకి భక్తుల ప్రదక్షిణలు, అర్చకుల ప్రత్యేక పూజలు
Also Read: 70 ఏళ్ల మహాగణపతికి 70 అడుగుల విగ్రహం- ఖైరతాబాద్ గణేషుడి విశేషాలు తెలుసా?