News
News
X

BJP MLA Etela Rajender: సీఎం కేసీఆర్ మాకు అస్త్రాలు ఇచ్చారు, వాటితోనే బుద్ధి చెబుతాం: ఈటల సెటైర్

BJP MLA Etela Rajender: హనుమకొండ జిల్లా బీజేపీ పార్టీ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ది రాజరిక పాలన, కుటుంబ పాలన అని ఆయన మండిపడ్డారు.

FOLLOW US: 
Share:

BJP MLA Eatala Rajender:  తెలంగాణ సీఎం కేసీఆర్ ఆటలు ఇక సాగవని, బీజేపీ మాత్రమే గద్దె దించుతుందుని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఫల్యాలు అనేకం ఉన్నాయని, వాటిని మనం ప్రజలకు చెప్తే చాలు. మనల్ని ప్రజలు నమ్ముతున్నారు అని ఈటల అన్నారు. హనుమకొండ జిల్లా బీజేపీ పార్టీ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ది రాజరిక పాలన, కుటుంబ పాలన అని మండిపడ్డారు. బీజేపీ మాత్రమే కేసీఆర్‌ను ఓడిస్తుందని, పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు ధైర్యంగా ఉండాలన్నారు. 

సీఎం కేసీఆర్ అస్త్రాలు ఇచ్చారు..
సమస్యలు పట్టించుకోకుండా అధికార ఉందని అహంకారంతో ప్రజలను ఇబ్బందిపెడుతున్న నేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు, మంత్రులు, కేసీఆర్ వారి ఫ్యామిలీ చేసే తప్పులే మనకు అస్త్రాలు అని, అవి కేసీఆర్ మనకు అందించారని ఈటల వ్యాఖ్యానించారు. రైతులకు రుణమాఫీ ఇవ్వని కేసీఆర్ రైతులకు నేనే ఛాంపియన్‌ను అని దేశమంతా చెప్పుకుని తిరగడం సిగ్గుచేటన్నారు. ప్రజా సమస్యల మీద కేసీఆర్ ఏనాడూ అల్ పార్టీ మీటింగ్ పెట్టలేదని గుర్తుచేశారు. అందుకే కేసీఆర్ ఇచ్చిన ఇలాంటి అవినీతి పాలన, వైఫల్యాలపై దొరికిన అస్త్రాలతో ప్రజల్లోకి వెళ్లాదని బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు. 

పెండింగ్‌లో పెన్షన్లు..
‘రాష్ట్రంలో పెన్షన్లు రెండు నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. కరెంట్ బిల్లులు పెంచడం కాదు. బైమంత్ ఉన్న బిల్లులను నెల నెలా వసూలు చేస్తున్నారు. కేసీఆర్ ప్రత్యక్షంగా పన్నులు వేయరు. పరోక్షంగా ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. గుజరాత్ లో ఆరు సార్లు అధికారం చెలాయించిన తరువాత ఏడవసారి బంపర్ మెజారిటీతో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారు. గుజరాత్ ఓటర్లు మరోసారి బీజేపీకే అండగా నిలిచారు. దేశమంతా ప్రజల చూపు బీజేపీ వైపు ఉంది. గుజరాత్ మోడల్ తో దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రజల్లోకి వెళ్లి మరోసారి విజయఢంకా మోగిస్తుందన్నారు. వంద కార్యక్రమాలు చేయడం కంటే ఒక్క కార్యక్రమం ప్రభావితం చేసేలా ఉండాలని’ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింతగా పెరిగింది. ఓవైపు కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శిక్ష అనుభవిస్తారని, ఇప్పటికే ఈడీ అధికారులు రెండు ఛార్జ్ షీట్ లలో కవిత పేరును ప్రస్తావించారని బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రం విషయాన్ని పక్కనపెట్టి, దేశాన్ని పట్టుకుని తిరుగుతూ జాతీయ స్థాయిలో మోసం చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సైతం అదే స్థాయిలో తమపై వచ్చిన ఆరోపణలు, విమర్శల్ని తిప్పికొడుతున్నారు. మద్యం దందాలో కవిత పేరు ఉందని బీజేపీ నేత రాజగోపాల్ చేసిన కామెంట్స్‌కు కవిత కౌంటర్ ఇచ్చారు. తొందరపడి మాట జారొద్దని, ఎన్నిసార్లు చెప్పినా అబద్దం నిజం అయిపోదని అభిప్రాయపడ్డారు. 

Published at : 21 Dec 2022 03:21 PM (IST) Tags: BJP Eatala Rajender Etela Rajender BRS Telangana KCR

సంబంధిత కథనాలు

Super Speciaity Hospital: దేశంలో తొలిసారిగా 24 అంతస్తుల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మన దగ్గరే!

Super Speciaity Hospital: దేశంలో తొలిసారిగా 24 అంతస్తుల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మన దగ్గరే!

Warangal Congress Politics : వరంగల్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు? జంగా రాఘవరెడ్డిపై వేటు!

Warangal Congress Politics : వరంగల్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు? జంగా రాఘవరెడ్డిపై వేటు!

SCT SI PTO: ప్రశాంతంగా ముగిసిన ఎస్‌టీసీ ఎస్‌ఐ పీటీవో టెక్నికల్‌ పరీక్ష! 60.92 శాతం హాజరు నమోదు!

SCT SI PTO: ప్రశాంతంగా ముగిసిన ఎస్‌టీసీ ఎస్‌ఐ పీటీవో టెక్నికల్‌ పరీక్ష! 60.92 శాతం హాజరు నమోదు!

Valmidi Srirama Navami : వల్మీడిలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు, ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి

Valmidi Srirama Navami : వల్మీడిలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు, ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

టాప్ స్టోరీస్

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్

Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!